తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు అంటే ప్రత్యేక పరిచయం అవసరం లేదు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే మోహన్ బాబు మాటతీరు కఠినంగా ఉంటుందని ప్రచారంలో ఉన్నప్పటికీ ఆయన మనసు మాత్రం ఎంతో మంచిది. సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు గురించి కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అతను మహా కోపిష్టి అని,అతనితో సినిమాలు చేయడానికి ఏ హీరోయిన్లు ముందుకు రారు అనే ప్రచారం అప్పట్లో పెద్ద ఎత్తున జరిగేది.
ఈ క్రమంలోనే అప్పటి నటి సుమలతకి మోహన్ బాబు సరసన నటించే అవకాశం వస్తే ఆమెకు కొందరు స్నేహితులు మోహన్ బాబుతో నటించవద్దని చెప్పారంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.అయితే గత కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమలత ఈ విషయం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబుతో సినిమా అవకాశాలు రావడం వల్ల అతనితో కలిసి నటించవద్దని తనకు ఎవరూ చెప్పలేదనే ఈ విషయాన్ని సుమలత ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.
అదేవిధంగా మోహన్ బాబు గురించి మాట్లాడుతూ నాకు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్నేహితుల లో మోహన్ బాబు కూడా ఒక మంచి స్నేహితుడు అని, ఇండస్ట్రీలో సినిమాలలో నటించక ముందే మోహన్ బాబు తన భర్త అంబరీష్ ఇద్దరూ మంచి స్నేహితులని ఆ విధంగా మోహన్ బాబు వ్యక్తిత్వం నాకు తెలుసు అనే విషయాన్ని ఈ సందర్భంగా సుమలత వెల్లడించారు.
ఇప్పటికి బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు తనకు ఏదైనా అవసరమైతే ముందుగా మోహన్ బాబు కి ఫోన్ చేస్తాననే విషయాన్ని కూడా తెలియజేశారు. మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు జరిగితే అతని కుటుంబం రావడం మోహన్ బాబు ఇంట్లో శుభకార్యాలకు మేము వెళ్లడం జరుగుతుందని మా రెండు కుటుంబాల మధ్య మంచి స్నేహ బంధం ఉందని తెలిపారు.
అంబరీష్ మృతి చెందిన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఎన్నికల పోటీలోకి దిగిన సుమలత కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరుతూ మోహన్ బాబు ట్వీట్ చేశారంటూ సుమలత మోహన్ బాబు మధ్య ఉన్న స్నేహ బంధం గురించి తెలిపారు. ప్రస్తుతం సుమలత మాండ్య లోక్‌సభ సభ్యురాలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…