ప్రస్తుత కాలంలో మన జీవనశైలిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఎన్నోరకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అలాంటి వాటిలో మధుమేహం ఒకటి. మధుమేహ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకి క్రమంగా పెరుగుతుంది. ఈ సమస్యతో బాధపడే వారు వారి ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవడానికి శ్రమిస్తారు.
ముఖ్యంగా డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవడం కోసం ఎన్నో మార్గాలను వెతుకుతుంటారు. అలాంటి వారికి సీతాఫలం ఒక అదృష్టం అని చెప్పవచ్చు.మధుమేహ సమస్యతో బాధపడేవారు వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవడానికి సీతాఫలం ఆకులు ఎంతో ప్రయోజనకరం.సీతాఫలం ఆకులను ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు నీటిలో కొన్ని ఆకులను వేసి బాగా మరిగించాలి.ఈ విధంగా సీతాఫలం ఆకులతో కషాయం తయారు చేసుకుని ప్రతిరోజూ పరగడుపున త్రాగటం వల్ల మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు.
సీతాఫలం ఆకులలో అధిక మొత్తంలో మెగ్నీషియం ఉండటం వల్ల గుండె పనితీరును గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తుంది. సీతాఫలం ఆకులు అధిక మొత్తంలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.ఈ క్రమంలోనే ప్రతిరోజు ఈ కషాయం తాగడం వల్ల సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయని చెప్పవచ్చు.
కేవలం సీతాఫలం ఆకులలో మాత్రమేకాకుండా, కాయలు, బెరడు,వేర్లు ఇలా ప్రతి ఒక్క భాగంలోనూ ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉండటం వల్ల సీతాఫలం మొక్కలను ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. ఈ సీతాఫలం మొక్కను వివిధ భాగాలలో ఉపయోగించడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, చర్మ వ్యాధులు, మధుమేహం, డయేరియా వంటి వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…