Featured

Avasaraala Srinivas : నాని నేను మంచి ఫ్రెండ్స్… కానీ ఇప్పుడు నాతో ఎలా ఉంటాడంటే… విజయ సాయి చనిపోడానికి కారణం : అవసరాల శ్రీనివాస్

Avasarala Srinivaas : ‘అష్టా చెమ్మ’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడిగిపెట్టిన శ్రీనివాస్ అవసరాల ఆ సినిమా తరువాత మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమాలో నాని తో పాటు నటించిన శ్రీనివాస్ అదే తరహా పాత్రలే మళ్ళీ వస్తున్నాయాన్న కారణంగా వెంటనే సినిమాలను చేయకుండా కొంత గ్యాప్ తీసుకుని మళ్ళీ ఆరంజ్, సరదాగా కాసేపు వంటి సినిమాలను చేసారు. ఇక సినిమాలో నటిస్తూనే మరోవైపు డైరెక్షన్ అలాగే రైటర్ గాను పేరు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్ మూడింటిలో ఏదో ఒక దాంట్లో ఫోకస్ చేసుంటే ఇప్పటికి స్టార్ డమ్ వచ్చుండేదేమో కానీ అలా కాకుండా నచ్చిన పని చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక తనతో పాటే కెరీర్ మొదలు పెట్టిన హీరో నాని ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు. అప్పుడు ఇప్పుడు వీరి ఫ్రెండ్షిప్ లో ఏవైనా తేడాలొచ్చాయా అన్న సంగతులను శ్రీనివాస్ పంచుకున్నారు.

నాని నేను అష్టా చెమ్మ టైములో అలా ఉండేవాళ్ళం…

అష్టా చెమ్మ సినిమా టైములోనే స్నేహితులుగా మారిన హీరో నాని అవసరాల శ్రీనివాస్ ఇద్దరూ డబ్బింగ్ కి వెళ్ళినపుడు ఎవరైనా పెద్ద ఆర్టిస్ట్ ఉంటే బయటికి వెళ్ళండి వాళ్ళ డబ్బింగ్ అయ్యేదాకా అంటే వెళ్లి కారులో కూర్చొని కబుర్లు చెప్పుకుండేవాళ్ళం. ఇప్పుడు నాని స్టార్ హీరో అయిపోయాడు అయినా ఇప్పటికీ కలిస్తే గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటాము అంటూ చెప్పారు అవసరాల. అష్టా చెమ్మ సినిమాలో సపోర్టింగ్ రోల్ కి నంది అవార్డు కు నామినేషన్ వచ్చినా ఆ సంవత్సరం అవార్డు అల్లరి నరేష్ కి గమ్యం సినిమాలో గాలిశీను పాత్రకు వచ్చింది.

నరేష్ ఆ పాత్రలో ఒదిగిపోయాడు, ఆ పాత్రకు రావడం చాలా బాగా అనిపించింది అంటూ నరేష్ తో ఆ తరువాత సినిమాలను చేశాను తాను నాకు మంచి మిత్రుడు అంటూ చెప్పారు. ఇక కమెడియన్ విజయసాయి మరణం గురించి మాట్లాడుతూ వరప్రసాద్ పొట్టి వరప్రసాద్ లో కలిసి నటించినపుడు పరిచయం ఉందని తాను చాలా సెల్ఫ్ కంట్రోల్ లాగా మాట్లాడేవాడు, స్ట్రగ్గల్స్ ఫేస్ చేయగలను అన్నట్లు చెప్పేవాడు కానీ అలా ఆర్థిక ఇబ్బందులకు వల్ల ఆత్మహత్య చేసుకుంటాడని అనుకోలేదు. అతని మరణం తరువాత అర్థమైంది పైకి చెప్పేది వేరు కానీ లోపల వారి స్ట్రగల్ వేరు అని అంటూ విజయ సాయి గురించి అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

1 day ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

1 day ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago