Featured

Chandra Mohan : ఆ కారణంగానే పిల్లలను చిత్ర పరిశ్రమకు పరిచయం చేయలేదు : చంద్ర మోహన్

Chandra Mohan : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటుడుగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు చంద్ర మోహన్. 1966 వ సంవత్సరంలో ‘రంగులరాట్నం’ సినిమాతో ఈయన సినీ ప్రస్థానం మొదలు పెట్టారు. అప్పటినుండి ఇప్పటివరకు దాదాపు 932 సినిమాల్లో నటించారు. అయితే ఇందులో 175 సినిమాల్లో హీరోగా నటించారు చంద్ర మోహన్. హీరోగా, కారెక్టర్ ఆర్టిస్తుగా, హాస్య నటుడుగా ఇలా చాలా విభిన్న పాత్రలను పోషించారు. అంతేకాదు ఈయనతో హీరోయిన్ గా మొదటి సినిమా చేస్తే తమ కెరీర్ లో ఉన్నత స్థాయి చేరుకుంటారు అన్నది కూడా వుంది. సిరిసిరిమువ్వ సినిమాతో జయప్రద, పదహారేళ్ల వయసు సినిమాతో శ్రీదేవి టాప్ హీరోయినలుగా నిలిచిన సంగతి తెలిసిందే.

ఇప్పటి తరం హీరోలతో కూడా నటిస్తూ, కెరీర్ లో తనని తాను అప్డేట్ చేసుకుంటూ అభిమానులను అల్లరిస్తున్నాడు. చిన్న సినిమా, పెద్ద సినిమా అన్న తేడా కేకుండా అన్ని సినిమాలలోనూ నటిస్తూ తన పాత్రకు న్యాయం చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే సినిమా ఇండస్ట్రీలో వున్న ప్రతి ఒక్కరు తమ పిల్లలను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తారు. ఇక అభిమానులలో మంచి పేరున్న వారి సంగతి చెప్పక్కరలేదు. కానీ చంద్రమోహన్ తన పిల్లలను ఇండస్ట్రీకి దూరంగా పెంచారు. దీని గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చంద్ర మోహన్ గారు పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.

భానుమతి గారు కూడా చాలా సార్లు అడిగారు…

పిల్లల ఇండస్ట్రీ పరిచయం గురించి చంద్ర మోహన్ ఇలా చెప్పారు.. తనకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరూ బాగుంటారు, ఇంకా చిన్న అమ్మాయి చాలా బాగుంటుంది. వీళ్ళని చిన్నప్పుడు భానుమతి గారు చూసి పిల్లలు బాగున్నారు చైల్డ్ ఆర్టిస్టులుగా పరిచయం చేద్దాం అని అడిగినా సున్నితంగా తిరస్కరించాను. నాకు పిల్లలతో గడిపే సమయం కూడా ఉండేది కాదు. వాళ్ళు లేవకముందే షూటింగ్ కి వెళ్ళిపోయేవాడిని, నా భార్య పిల్లలను ఎపుడైనా షూటింగ్ కి తీసుకువచ్చేది, వాళ్ళు నన్ను గుర్తు పట్టే వాళ్ళు కాదు. ఒకసారి వారికి సినిమా రుచి చూపిస్తే మళ్ళి షూటింగ్ ఎపుడు అని అడుగుతారని భయం. సినిమా ప్రభావం వారిమీద పడకుండా ఇద్దరినీ పెంచాలి అనుకున్నాం, అలాగే పెంచామని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఇద్దరూ బాగా చదివి గోల్డ్ మెడల్స్ సాధించారు, మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇద్దరికీ మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయాలి అన్న ఆలోచన మాత్రమే వుంది అని ఆయన చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago