యూట్యూబర్ గాఎంతో మంచి పాపులారిటీని సంపాదించుకుంది ఎన్నో వెబ్ సిరీస్ లో నటిస్తూ ఎన్నో వీడియో సాంగ్స్ ద్వారా ఎంతో పాపులారిటీ దక్కించుకున్న వారిలో షణ్ముఖ్ జస్వంత్ ఒకరు. ఇక ఈయన వెబ్ సిరీస్ లో నటించి విశేషం ఆదరణ దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే తనకున్న పాపులారిటి తో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి షణ్ముఖ్ దీప్తి సునయన గురించి బయట పెద్దఎత్తున ప్రచారం ఉంది.
వీరిద్దరు కలిసి ఎన్నో వెబ్ సిరీస్లలో నటించడంతో వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఉందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే వీరి లవ్ గురించి వీరు ఎప్పుడూ బయట పడలేదు. కానీ షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళిన తర్వాత దీప్తి సునైనా అతని గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చేయడమే కాకుండా వారిద్దరు కలిసి దిగిన ఫోటోలు షేర్ చేశారు. ఈ క్రమంలోనే దీప్తి సునైనా షణ్ముఖ్ గురించి బయట పెద్ద ఎత్తున ప్రమోట్ చేయగా హౌస్ లో ఉన్నటువంటి షణ్ముఖ్ దీప్తి సునైనాను తలుచుకుంటే ఉండేవారు.
ఇలా వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ బయటపడింది. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా తాజాగా చిన్నారి పెళ్లి కూతురు నటి అవికా గోర్ ఈ జంటపై స్పందిస్తూ షాకింగ్ కామెంట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ షణ్ముఖ్ గేమ్ చాలా బాగా ఆడుతున్నారని, డాన్స్ కూడా బాగా చేస్తారంటూ తన పై ప్రశంసలు కురిపించారు.
అంతేకాకుండా దీప్తి-షణ్ముఖ్ రిలేషన్ గురించి మాట్లాడుతూ వారిద్దరు బాండింగ్ ఎంతో బాగుంటుంది అంటూ ఈమె షాకింగ్ కామెంట్స్ చేసారు. ఇక అవికా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిగ్ బాస్ అవకాశం వస్తే మీరు వెళ్తారా అంటూ ఆమెను ప్రశ్నించగా అస్సలు వెళ్లనని తనకు అన్ని రోజులు ఉండే ఓపిక లేదంటూ ఈమె తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…