Avika Gor's engagement! You'll be shocked to know the background of your future husband!
బుల్లితెరపై చిన్నారి పెళ్లి కూతురుగా మనందరినీ అలరించిన అవికా గోర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోంది. తన ప్రియుడు మిలింద్ చంద్వానీతో ఆమె నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో అవికా, మిలింద్ ఒకరికొకరు ఉంగరాలు తొడుక్కున్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన సంతోషాన్ని పంచుకుంది అవికా.
“అతను అడగగానే నేను ఏడ్చేశాను! ఎప్పటి నుంచో ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నట్టుగా వెంటనే ‘Yes’ అని చెప్పేశాను. నా మైండ్‌లో ఏదో మంచి బీజీఎమ్ మోగుతోంది. ఇదంతా స్లో మోషన్‌లో జరుగుతున్నట్టు ఉంది. అతనేమో చాలా ప్రశాంతంగా, తెలివిగా ఉన్నాడు. మేమిద్దరం ఒకరికోసం ఒకరం పుట్టినట్టున్నాం. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఉన్నాం” అని తన మనసులోని మాటలను బయటపెట్టింది అవికా.
అంతేకాదు, “అతను నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగినప్పుడు నాలో ఉన్న హీరోయిన్ ఒక్కసారిగా బయటకు వచ్చేసింది. గాల్లో తేలిపోయినట్టు అనిపించింది. కళ్లలో నీళ్లు తిరిగాయి. మైండ్ బ్లాంక్ అయిపోయింది. నిజమైన ప్రేమంటే ఇదేనేమో! ప్రేమలో అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండకపోవచ్చు. కానీ అందులో ఒక మ్యాజిక్ ఉంటుంది” అంటూ తన ప్రేమను వ్యక్తపరిచింది.
ప్రస్తుతం అవికా గోర్, మిలింద్ చంద్వానీల ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో పాపులర్ అయిన అవికా గోర్.. ఆ తర్వాత హీరోయిన్‌గా కూడా రాణించింది. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.
ఇక అవికాను పెళ్లాడబోయే మిలింద్ చంద్వానీ గురించి తెలుసుకుందామా? మిలింద్ ఒక సామాజిక కార్యకర్త, వ్యాపారవేత్త, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా. అంతేకాదు, అతను ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ పూర్తి చేశాడు. ప్రస్తుతం క్యాంప్ డైరీస్ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నాడు. 2019లో క్యాంప్ డైరీస్ నిర్వహించిన కార్యక్రమంలో అవికా గోర్ పాల్గొంది. అప్పటినుంచి వీరి మధ్య పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లితో ఈ బంధాన్ని మరింత బలపరుచుకోనున్నారు.
మొత్తానికి అవికా గోర్ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. ఈ జంటకు మనమూ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుదాం!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…