Political News

Perni Nani : వైసీపీకి ఊహించని షాక్.. మాజీ మంత్రి పేర్ని నాని అరెస్ట్ కానున్నారా?

Perni Nani : వైసీపీ పార్టీకి ఇది నిజంగా పెద్ద ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. మాజీ మంత్రి పేర్ని నాని నివాసం వద్ద హడావుడిగా పరిస్థితులు నెలకొన్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, పోలీసులు మరికాసేపట్లో పేర్ని నానిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారట. ఈ వ్యవహారం వెనుక నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన కేసు ఉన్నట్లు తెలుస్తోంది.

Is former minister Perni Nani going to be arrested?

పోలీసులు నమోదు చేసిన కేసులో పేర్ని నానితో పాటు ఆయన కుమారుడు కిట్టు కూడా ఈ అక్రమాల్లో భాగస్వాములని ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులకు లభించాయని సమాచారం. అయితే, ఈ అరెస్ట్‌ను నివారించేందుకు పేర్ని నాని ముందస్తుగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గురువారం విచారణ జరగనుంది. కోర్టు తీర్పు కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉండగా, పేర్ని నాని కుమారుడు కిట్టు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పేర్ని నాని తన అనుచరులు, కార్యకర్తలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఆయన నివాసం వద్దకు భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. పరిస్థితి ఉత్కంఠగా మారింది. అసలేం జరుగుతుందో వేచి చూడాలి.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago