Motorists face heavy fines with new traffic rules! If you make this mistake, you will be fined ₹25,000!
స్నేహితులారా, మన దేశంలో రోడ్డు ప్రమాదాలు ఎంతలా జరుగుతున్నాయో మనందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే చాలా మంది ట్రాఫిక్ రూల్స్‌ను సరిగ్గా పాటించకపోవడమే. అతివేగంగా వెళ్లడం, ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, హెల్మెట్ లేకుండా బండి నడపడం, తాగి డ్రైవ్ చేయడం వంటివి చేస్తుంటారు. వీటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే ప్రభుత్వం కొత్త రూల్స్‌తో మీ ముందుకు వచ్చింది. 2025 నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. వీటి గురించి తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు.
తాగి డ్రైవ్ చేస్తే భారీ మూల్యం: మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే మొదటిసారి రూ.10,000 ఫైన్ లేదా 6 నెలల జైలు శిక్ష విధిస్తారు. మళ్ళీ అదే తప్పు చేస్తే జరిమానా రూ.15,000 వరకు ఉంటుంది, జైలు శిక్ష 2 సంవత్సరాల వరకు పెరగవచ్చు. కాబట్టి, డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
రెడ్ లైట్ దాటితే అంతే సంగతులు: సిగ్నల్ జంప్ చేస్తే రూ.5,000 ఫైన్ కట్టాల్సిందే. ఇదివరకు ఈ ఫైన్ రూ.500 మాత్రమే ఉండేది. ఇప్పుడు రూల్స్ మరింత కఠినంగా మారాయి.
వేగం పెంచితే జేబుకు చిల్లు: మీరు అనుకున్న దానికంటే వేగంగా బండి నడిపితే రూ.5,000 వరకు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా, బరువు మోసే వాహనాల్లో పరిమితికి మించి బరువు ఉంటే రూ.20,000 ఫైన్ వేస్తారు.
లైసెన్స్ లేకుంటే లాభం లేదు: మీ దగ్గర లైసెన్స్ లేకుంటే రూ.5,000 ఫైన్ కట్టాలి. ఒకవేళ మీ దగ్గర డిజిలాకర్ లేదా ఎమ్పరివాహన్ యాప్‌లో లైసెన్స్ ఉన్నా సరిపోతుంది.
పొల్యూషన్ సర్టిఫికేట్ లేదా.. ఇంకేముంది గొడవ: మీ వాహనం పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్ లేకుండా రోడ్డు మీదకు వస్తే రూ.10,000 ఫైన్ మరియు 6 నెలల జైలు శిక్ష విధిస్తారు.
సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే అంతే: కారులో డ్రైవర్ మాత్రమే కాదు, ప్రయాణికులు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. లేదంటే రూ.1,000 ఫైన్ పడుతుంది.
ముగ్గురు కలిసి బైక్ మీద వెళ్తున్నారా.. ఆగండి: బైక్ మీద ముగ్గురు వెళ్తే రూ.1,000 ఫైన్ కట్టాల్సిందే.
హెల్మెట్ లేకుంటే ఫైన్: హెల్మెట్ లేకుండా బండి నడిపితే రూ.1,000 ఫైన్ వేస్తారు. అంతేకాదు, మీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా 3 నెలల పాటు రద్దు చేస్తారు.
మైనర్ డ్రైవింగ్ చేస్తే సీరియస్: ఒకవేళ మైనర్ ఎవరైనా బండి నడుపుతూ పట్టుబడితే వారి తల్లిదండ్రులకు రూ.25,000 ఫైన్ మరియు 3 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. అంతేకాదు, ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేస్తారు.
ఫోన్ మాట్లాడితే ఫైన్: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ మాట్లాడితే రూ.5,000 వరకు ఫైన్ వేస్తారు. ఇది చాలా ప్రమాదకరమని గుర్తించండి.
ఇవి కొత్త రూల్స్. వీటిని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. సురక్షితంగా ఉండండి, మీ వాళ్ళని కూడా సురక్షితంగా ఉంచండి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…