General News

Trending News : భార్యలు భర్తలను చంపడం.. కొత్త ట్రెండ్‌గా మారుతోందా? అసలు ఏం జరుగుతుంది?

Trending News : వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక తీపి జ్ఞాపకం. యువతీయువకులు వివాహం కోసం చాలా కలలు కంటారు. అబ్బాయి, అమ్మాయి ఇష్టాలతో జరిగేదే పెళ్లి. ఇద్దరిలో ఎవరికి ఇష్టం లేకున్నా అది మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుంది. బలవంతపు పెళ్లిళ్లు ఎన్నాళ్లు నిలుస్తాయి? ఒకప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు ఎక్కువగా జరిగేవి. కానీ ఇప్పుడు ప్రేమ వివాహాలు ఎక్కువైపోయాయి. కొంతమంది అమ్మాయిలు పెద్దలను ఎదిరించి మరీ ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మరికొంతమంది తల్లిదండ్రుల మాట కాదనలేక ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఆ తర్వాత ప్రేమించిన ప్రియుడిని మర్చిపోలేక కొన్ని రోజులకే భర్తలకు విడాకులు ఇస్తున్నారు. ఇంకొందరు అమ్మాయిలు ఏకంగా భర్తల ప్రాణాలను తీస్తున్నారు.

Is it becoming a new trend for wives to kill their husbands? What is actually happening?

ఇటీవల భార్యలు భర్తలను చంపిస్తున్న ఘటనలు చూసి పెళ్లంటేనే భయపడే పరిస్థితికి వచ్చారు యువకులు. సింగిల్గా అయినా ఉంటాం కానీ ఈ తరం అమ్మాయిలను మాత్రం పెళ్లి చేసుకోము బాబోయ్ అంటూ గగ్గోలు పెడుతున్నారు. పెళ్లయ్యాక కూడా ప్రియుడితో సంబంధం కొనసాగిస్తున్నారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడి సాయంతో భర్తలను అంతమొందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు ఎక్కువైపోయాయి.

కొంతకాలం క్రితం యూపీలోని మీరట్లో సౌరభ్ కుమార్ను తన భార్య ముస్కాన్ రస్తోగి ప్రియుడి సాయంతో అతి కిరాతకంగా చంపింది. భర్త డెడ్బాడీని ముక్కలు ముక్కలుగా నరికి డ్రమ్ములో వేసి సిమెంట్తో కప్పేసింది. ప్రియుడి మోజులో పడి సుపారీ ఇచ్చి భర్తల ప్రాణాలు తీస్తున్నారు. ఆ మధ్య అమీన్పూర్లో ప్రియుడి మోజులో పడి కడుపున పుట్టిన ముగ్గురు పిల్లల ప్రాణాలు తీసింది ఓ తల్లి. తాజాగా మేఘాలయలో హనీమూన్కు వెళ్లి కిరాయి రౌడీలతో భర్తను చంపించిన భార్య ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఇటీవలి కాలంలో ప్రియుళ్ల కోసం భర్తల ప్రాణాలు తీస్తున్నారు అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. కొందరు అమ్మాయిలు పెళ్లికి నో చెప్పి తల్లిదండ్రులను బాధపెట్టడం కంటే కట్టుకున్న భర్తను చంపించడం ఈజీ అనుకుంటున్నారు అని రాసుకొచ్చాడు. ఇది నెట్టింటా చర్చనీయాంశంగా మారింది. ఈ తరం అమ్మాయిలు కొత్త ట్రెండ్ ఏమైనా సెట్ చేస్తున్నారా అని పలువురు ప్రశ్నించుకుంటున్నారు. ఒకప్పుడు తల్లిదండ్రులు తమ కూతుర్లను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు కొడుకులను రక్షించుకోవాల్సిన పరిస్థితి దాపురించిందంటున్నారు. ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఓ వ్యక్తి ప్రాణాన్ని తీయడం కంటే ముందుగానే ప్రేమించిన ప్రియుడితో వెళ్లిపోవచ్చు కదా అని పలువురు కామెంట్ చేస్తున్నారు. లేకపోతే డివోర్స్ ఇచ్చి ఎవరికి నచ్చినట్లు వారు బతకొచ్చు కదా అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. భర్తలను చంపి కటకటాలపాలై అటు కన్న తల్లిదండ్రులను, ఇటు కట్టుకున్న వాడి ఫ్యామిలీని రోడ్డున పడేస్తున్నారు. అమ్మాయిలు ఇలా చేయడం మీకు తగునా అని యువకులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భర్తలను బతకనివ్వరా? భర్తల కోసం కూడా ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

అసలు ఈ తరం అమ్మాయిలు ఇలా ప్రవర్తించడానికి కారణాలు ఏమిటి? సినిమాల ప్రభావమా? సోషల్ మీడియా ఎఫెక్టా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. తల్లిదండ్రులు ఎవరైనా ఎదిగిన తమ కూతురికి పెళ్లి చేసి బాధ్యత తీర్చుకోవాలనుకుంటారు. మంచి వరుడిని చూసి ఘనంగా పెళ్లి చేయాలని భావిస్తారు. కానీ ఇదంతా ఒకప్పటి లెక్క. ఇప్పుడు అంతా మారిపోయింది. పేరెంట్స్ మంచి సంబంధాన్ని కుదిర్చి పెళ్లి చేయాలని భావిస్తే ఆ పెళ్లి పీటలెక్కడం లేదు. ఒకవేళ పెళ్లి జరిగినా కొన్ని రోజులకే వివాహబంధానికి స్వస్తి పలికి ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. దీనికి గల కారణం ఆ యువతి అప్పటికే మరో వ్యక్తిని ప్రేమించడం. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పకపోవడం. తమ ప్రేమ విషయాన్ని చెప్పి తల్లిదండ్రులను నొప్పించలేక అయిష్టంగా పెళ్లి చేసుకుంటున్నారు. ఒకవేళ ప్రేమ విషయాన్ని చెప్పినా బలవంతంగా పెళ్లి చేస్తున్నారు. ఎక్కడ కూడా అనుమానం రాకుండా నయవంచనకు పాల్పడుతున్నారు కొందరు యువతులు. పెళ్లి తర్వాత ప్రియుడిని మర్చిపోలేక కట్టుకున్న వాడిని కాటికి పంపిస్తున్నారు. మరికొంతమంది తీరా తాళి కట్టే సమయానికి పెళ్లి ఇష్టం లేదని షాక్ ఇవ్వడం.. ఇదంతా ఈ రోజుల్లో కామన్ అయిపోయింది.

ఇటీవల కొంతమంది అమ్మాయిలు రీల్ లైఫ్‌కూ, రియల్ లైఫ్‌కూ మధ్య వ్యత్యాసాన్ని గుర్తించలేకపోతున్నారు. పెళ్లి తర్వాత జీవితం లగ్జరీగా ఉంటుందని ఊహించుకుంటున్నారు. కానీ, వాస్తవానికి అది జరగకపోవడంతో విడాకులకు సిద్ధమవుతున్నారు. అంతేకాదు, సోషల్ మీడియాలో ఏర్పడిన పరిచయాలు ప్రేమగా మారి, ప్రియుడి కోసం ఇంట్లోంచి వెళ్లిపోయి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగులుస్తున్నారు. దీనివల్ల కొంతమంది తల్లిదండ్రులు పరువు పోయిందని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి, కూతుళ్లు తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండాలి. పెళ్లి అనేది ఒక నిండు నూరేళ్ల ప్రయాణం. కాబట్టి, ఇష్టంలేని పెళ్లిళ్లు చేసుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దని పెద్దలు సూచిస్తున్నారు.

telugudesk

Recent Posts

రూ.250 కోట్లు డిమాండ్.. విజయ్-సంగీత విడాకుల కేసు హాట్ టాపిక్

తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…

4 hours ago

వేసవిలో అమృతం లాంటి పానీయం.. ఈ నేచురల్ డ్రింక్ మీకు కూలింగ్ ఇస్తుంది!

వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…

4 hours ago

కూతురు పెళ్లిపై కమల్ ఫోకస్.. శృతి హాసన్ మ్యారేజ్ టాక్ వైరల్

సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…

4 hours ago

తిరుమలలో తమన్నా దర్శనం.. శ్రీవారి ఆశీస్సులు పొందిన స్టార్ హీరోయిన్!

ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…

5 hours ago

సబ్‌స్క్రిప్షన్ వివాదంపై అనన్య నాగళ్ల క్లారిటీ.. “అది నా ఉద్దేశ్యం కాదు!”

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె…

5 hours ago

శ్రీశైలంలో భక్తుడి అరుదైన కానుక.. వెండి నాగాభరణం సమర్పణ!

తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…

5 hours ago