Avinash: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ముక్కు అవినాష్ ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనప్పటికీ స్టార్ మాలో పలు కార్యక్రమాల పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇలా కెరియర్ పరంగా అవినాష్ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈయన తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇకపోతే తాజాగా అవినాష్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన తల్లి మల్లమ్మకు అనారోగ్యం చేసిందని విషయాన్ని వెల్లడించారు.గత కొంతకాలంగా అమ్మ షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు అయినప్పటికీ తను సరైన ఆహారం తీసుకునేది కాదు కానీ ఉన్నఫలంగా తనకు ఆరోగ్యం బాగాలేక పోవడంతో తనని హైదరాబాద్ తీసుకువచ్చానని తెలిపారు.
ఇలా తనకు పరీక్షలు నిర్వహించగా డాక్టర్లు తనకు గుండెలో రెండు పెద్ద బ్లాక్స్ ఉన్నాయని వెంటనే స్టంట్ వేసి సర్జరీ చేయాలని చెప్పారు. దీంతో అమ్మకు వైద్యులు స్టంట్ వేసి సర్జరీ నిర్వహించారని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన తల్లి పరిస్థితిని తెలియజేశారు. ఎప్పుడు ఎంతో యాక్టివ్ గా ఉండే తన తల్లి ఇలా హాస్పిటల్ బెడ్ పై ఉండటం చూసినటువంటి అవినాష్ కన్నీళ్లు పెట్టుకున్నారు..
ఇలా అవినాష్ షేర్ చేసినటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు తన తల్లి తొందరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక అవినాష్ భార్య అనూజ గురించి కూడా అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం అనూష ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ఈయన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేసిన సంగతి తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…