NTR Son: ఇప్పటికే ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులు హీరోలుగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే అయితే యంగ్ హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి మహేష్ బాబు అల్లు అర్జున్ వంటి పిల్లలు కూడా పలు సినిమాలలో బాల నటులుగా నటిస్తూ సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో గ్లోబల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఎన్టీఆర్ కుమారుడు కూడా ఇండస్ట్రీలోకి రావడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.
ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఈయన పెద్ద కుమారుడు అభయ్ రామ్ త్వరలోనే వెండితెరపై సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. అభయ్ రామ్ ప్రముఖ స్టార్ డైరెక్టర్ సినిమాలో కీలకపాత్రలో నటించబోతున్నారని సమాచారం.అయితే ఈ సినిమాలో అభయ్ రామ్ తో పాటు మహేష్ బాబు కుమార్తె సితార కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది.
వీరిద్దరూ అక్క తమ్ముడి పాత్రలో కనిపించబోతున్నారంటూ ఓ వార్త వైరల్ గా మారడంతో మహేష్ బాబు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి వీరిద్దరూ ఏ సినిమాలో నటించబోతున్నారు అనే విషయానికి వస్తే రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఓ అడ్వెంచర్స్ మూవీ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇందులో భాగంగా వీరిద్దరూ 15 నిమిషాల పాటు సినిమాలో నటించబోతున్నారని సమాచారం.
ఇలా ఎన్టీఆర్ కి ఎన్నో బ్లాక్ బస్టర్ అందించినటువంటి రాజమౌళి దర్శకత్వంలో ఆయన కొడుకు కూడా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారన్న వార్త ఎన్టీఆర్ అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. మరి వీరిద్దరి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…