Featured

Avinash: గర్భంలోనే మరణించిన అవినాష్ బిడ్డ… ఎమోషనల్ అయిన కమెడియన్!

Avinash: ముక్కు అవినాష్ పరిచయం అవసరం లేని పేరు ఈయన కమెడియన్ గా జబర్దస్త్ కార్యక్రమంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతూనే అనంతరం బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలను పొందినటువంటి ఈయన ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్నటువంటి బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.

Avinash: శేఖర్ మాస్టర్ పరువు దారుణంగా తీసేసిన ముక్కు అవినాష్.. ఏం జరిగిందంటే?

ఇలా బుల్లితెర కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నటువంటి అవినాష్ 2021 వ సంవత్సరంలో అనూజ అనే అమ్మాయిని ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇక వీరి పెళ్లి జరిగిన తర్వాత వీరిద్దరూ కలిసి పలు షోలలో కూడా సందడి చేశారు. ఇక యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకునేవారు.

ఇకపోతే ఈమె ప్రెగ్నెంట్ అనే విషయాన్ని కూడా అవినాష్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక వీడియో రూపంలో తెలియజేశారు. అలాగే తన భార్యకు సీమంతపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇటీవల తన భార్య మెటర్నటీ ఫోటోషూట్ కి సంబంధించినటువంటి ఫోటోలను ఈయన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ త్వరలోనే తల్లిదండ్రులుగా మారబోతున్నాము అంటూ వ్యక్తం చేశారు. అయితే ఆ ఆనందం ఎక్కువ రోజులు లేదని తెలుస్తుంది.

ప్రశ్నలు అడిగి బాధ పెట్టదు..

ఇటీవల అవినాష్ సోషల్ మీడియా వేదికగా తాము తల్లిదండ్రులుగా మారబోతున్నామని సంతోషించాము. కానీ బిడ్డను మేము కడుపులోనే కోల్పోయామంటూ అవినాష్ ఈ విషయాన్ని వెల్లడించారు నా అభిమానులను నా కుటుంబంగా భావిస్తాను అందుకే ఈ విషయాన్ని మీతో చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది అంటూ ఈయన పురిటి లోనే తన బిడ్డను కోల్పోయినట్టు తెలిపారు. ఇక ఈ విషయం గురించి ఎక్కువగా నన్ను ప్రశ్నలు అడిగి బాధ పెట్టకండి అంటూ ఈయన తన ఆవేదన బయటపెట్టారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago