Brahmanandam: హాస్యబ్రహ్మ బ్రహ్మానందం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో వందల సినిమాలలో నటించి కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం ఈయన తన విలువైన సమయాన్ని ఎక్కువగా తన కుటుంబానికే కేటాయిస్తూ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్నారు. బ్రహ్మానందం వృత్తిపరంగా తెలుగు లెక్చరర్ అనే సంగతి మనకు తెలిసిందే. ఇక ఈయన ఇంటి దగ్గర ఎక్కువగా ఉండడంతో తన ఆత్మ కథను తానే స్వయంగా రాసుకున్నారు.
నేను మీ బ్రహ్మానందం అనే పుస్తకం ఇటీవల చిరంజీవి చేతుల మీదుగా ఆవిష్కరించిన సంగతి తెలిసిందే ఇందులో ఈయన తన జీవితంలో జరిగినటువంటి సంఘటనలన్నింటిని కూడా తెలియజేశారు. అయితే ఈయన చదువుతున్నప్పుడు పడినటువంటి కష్టాలను ఈ సందర్భంగా తన ఆత్మకథ పుస్తకంలో తెలియజేశారు. తనలో ఉన్నటువంటి టాలెంట్ చూసి చాలామంది తనని ప్రోత్సహించారని చాలామంది సహాయంతో తాను చదువుకున్నానని తెలిపారు.
ఇక తాను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చేస్తున్నటువంటి సమయంలో హాస్టల్లో ఉండి చదువుకోవడానికి డబ్బు అవసరమైంది అయితే ప్రతిదీ ఇతరుల మీద ఆధారపడి బ్రతకకుండా ఏదైనా చిన్న పని చేద్దామంటూ ఈయన తన కాలేజీకి వెళ్లే దగ్గర లారీలకు పెయింటింగ్ వేసే షాపు కనిపించింది దీంతో అక్కడికి వెళ్లి ఏదైనా పని ఉందా అని అడగడంతో సహాయకుడిగా తనని చేర్చుకున్నారని ఈ పుస్తకంలో తెలిపారు.
అదే నా మొదటి సంపాదన..
ఇలా ప్రతిరోజు ఉదయం కాలేజీకి వెళ్లి సాయంత్రం ఆ లారీ షాప్ లో పనిచేస్తూ లారీలకు పెయింటింగ్ వేసే వారిని అప్పట్లో నెల జీతం అని కాకుండా పనిబట్టి డబ్బులు ఇచ్చేవాళ్ళు అలా నాకు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఇచ్చే వాళ్ళు ఇదే నా మొదటి సంపాదన అని అప్పట్లో ఈ డబ్బులు అంటే చాలా ఎక్కువ అంటూ బ్రహ్మానందం తన మొదటి సంపాదన గురించి తన ఆత్మ కథ పుస్తకంలో ఈ సందర్భంగా తెలియజేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…