Pallavi prashanth: పల్లవి ప్రశాంత్ రైతుబిడ్డ అంటూ ఎన్నో రకాల వీడియోల ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈయన తొలిసారి బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విజేతగా నిలబడటంతో ఈయన ఏకంగా సెలబ్రిటీగా మారిపోయారు. అయితే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఈరోజు ఈయన అభిమానులు చూపిన అత్యుత్సాహం కారణంగా పల్లవి ప్రశాంత్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రెండు రోజులపాటు చంచల్ గూడ జైలులో ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్ అనంతరం బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇలా అరెస్టయి బయటకు వచ్చిన తర్వాత ప్రశాంత్ ఎక్కడా కూడా కనపడలేదు ఇంటిపట్టునే ఉంటూ తన పనులు తాను చూసుకుంటున్నారు అయితే మొదటిసారి ఈయన మరొక బుల్లితెర కార్యక్రమంలో సందడి చేశారు.
స్టార్ మా వాళ్లు నా సామిరంగా అంటూ సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరూ కూడా పాల్గొని సందడి చేశారు అయితే ఇక్కడ కూడా శివాజీ గ్రూప్ అలాగే సీరియల్ బ్యాచ్ రెండుగా విడిపోయారు. ఇలా ఈ రెండు గ్రూపులు నాగార్జునను మెప్పించి సంక్రాంతి పండుగకు వారి ఊరికి తీసుకువెళ్లాలి.
నాగార్జున ముందే గొడవ…
ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్ మరోసారి అమర్ కు టార్గెట్ చేయడమే కాకుండా బరాబర్ నాగార్జున సర్ మా ఊరికే వస్తారు.. ఈ విషయంలో తగ్గేదే లే అని సవాల్ విసురుతున్నాడు. లేదు మా ఊరికి వస్తాడు అంటూ అమర్ కూడా చెప్పడంతో ఈ విషయంలో వీరిద్దరి మధ్య మరోసారి నాగార్జున ముందే గొడవ జరిగింది అయితే ఇదంతా కూడా షోలో భాగంగానే చేశారని తెలుస్తోంది మొత్తానికి ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్ లందరూ కూడా మరోసారి బుల్లితెరపై సందడి చేయబోతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…