Avinash: ముక్కు అవినాష్ పరిచయం అవసరం లేని పేరు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ముక్కు అవినాష్ అనంతరం బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం అవినాష్ పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇలా పలు కార్యక్రమాల ద్వారా ఎంతో బిజీగా ఉన్నటువంటి అవినాష్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.
ఇకపోతే అవినాష్ పలుసార్లు పెద్ద ఎత్తున నేటిజన్ల ఆగ్రహానికి గురవుతూ ఉంటారు. ఆయన చేసే కొన్ని పనుల కారణంగా తనకు తెలియకుండానే ట్రోలింగ్స్ కు గురవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అభిమానుల ఆగ్రహానికి ముక్కు అవినాష్ గురయ్యారు.దీంతో అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈయనకు పెద్ద ఎత్తున వార్నింగ్ ఇస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ఇలా అవినాష్ కుఅల్లు అర్జున్ అభిమానులు వార్నింగ్ ఇవ్వడానికి గల కారణం ఏంటి అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే… అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2సినిమా నుంచి తన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ ఫోటోలో అల్లు అర్జున్ అమ్మవారి రూపంలో ఎంతో భయంకరంగా ఉన్నారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తూ భారీ స్థాయిలో వ్యూస్ కైవసం చేసుకుంది.
ఇకపోతే అవినాష్ అరకొర ఎడిటింగ్ తో తన ఫోటోని ఎడిట్ చేస్తూ ఓన్ మేడ్ పిక్ తో అల్లు అర్జున్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.ఇలా అమ్మవారి రూపంలో అవినాష్ ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారి బన్నీ అభిమానులు అవినాష్ పై ఫైర్ అవుతున్నారు. వెంటనే ఈ ఫోటో డిలీట్ చెయ్యి లేకపోతే నీకు పగులుతుంది అంటూ మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. అల్లు అర్జున్ ఈ గెటప్ లో ఉంటే అమ్మవారి లా ఉన్నారు నువ్వు మాత్రం ఈ గెటప్ లో ఉంటే పక్కింటి మంగమ్మలా ఉన్నావు అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…