Movie News

Baby Varalakshmi: స్టార్ హీరోలకు చెల్లిగా నటించిన బేబీ వరలక్ష్మి ఆస్తి ఎన్ని కోట్ల తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Baby Varalakshmi: సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా రాణిస్తున్న వాళ్లు మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా బాగా సంపాదించి కోట్ల రూపాయల ఆస్తులు వెనకేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఖరీదైన ఇల్లు, కార్లు కొనుగోలు చేసి కోట్ల రూపాయల ఆస్తులు కూడా సంపాదించుకుంటున్నారు. ఇదిలా ఉండగా 30 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తూ స్టార్ హీరోలకు చెల్లిగా నటించి గుర్తింపు పొందిన బేబీ వరలక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం.

చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బేబీ వరలక్ష్మి ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరి చెల్లెలిగా నటించి మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత 19 ఏళ్ల వయసులో వివాహం చేసుకొని పాప పుట్టిన తర్వాత ఇండస్ట్రీకి దూరం అయింది. కొంత కాలం తర్వాత సీరియల్స్ లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయింది. ఇలా కొంతకాలం సీరియల్స్ లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న వరలక్ష్మి చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది.

ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బేబీ వరలక్ష్మి తన సినీ జీవితం గురించే కాకుండా వ్యక్తిగత విషయాల గురించి కూడా వెల్లడించింది. ఈ ఇంటర్వ్యూలో బేబీ వరలక్ష్మి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఏఎన్నార్ చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వంటి స్టార్ హీరోలకు చెల్లిగా నటించానని, ఇక ఇప్పుడు వారి పిల్లలకు తల్లిగా నటించాలని కోరికగా ఉందని తన మనసులో మాట బయట పెట్టింది.

Baby Varalakshmi: స్కూల్ ఫీజులు కట్టేకే సరిపోయేది కాదు…

ఇక ఈ ఇంటర్వ్యూలో బేబీ వరలక్ష్మి ఆస్తుల వివరాల గురించి యాంకర్ ప్రస్తావించగా ఆమె స్పందిస్తూ.. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసే సమయంలో తనకి ఇచ్చే రెమ్యునరేషన్ స్కూల్ ఫీజులు కట్టడానికి కూడా సరిపోయేది కాదని వెల్లడించింది. ఆ తర్వాత చెల్లి పాత్రలలో నటించటం వల్ల కొంచం ఎక్కువగానే రెమ్యునరేషన్ ఉండేదని చెప్పుకొచ్చింది. అయితే తాను సినిమాలలో నటించిన సమయంలో కొంతవరకు ఆస్తులు కూడబెట్టుకున్నానని అవి ఉండటం వల్ల ఇప్పుడు ఏ ఇబ్బందీ లేకుండా సంతోషంగా జీవిస్తున్నానని తెలిపింది. అయితే మరి వందల కోట్లు విలువ చేసే ఆస్తులు కాకుండా కొంత మేరకు ఆస్తులు ఉన్నాయని వివరించింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago