పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భీమ్లానాయక్. ఈ చిత్రం కోసం అభిమానుల ఎదురుచూస్తున్నారు. మళయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం సినిమాకు రిమేక్ గా భీమ్లా నాయక్ తెరకెక్కుతోంది. ప్రుథ్వీరాజ్ సుకుమారన్, బిజూ మీనన్ పోటా పోటీగా నటించిన మళయాళం సినిమా అక్కడ రికార్డ్ కలెక్షన్లను సాధించింది.
దీంతో తెలుగులో కూడా విపరీతంగా హైప్ క్రియేట్ అయ్యింది. రానా దగ్గుబాటి కీలక పాత్ర పోషిస్తున్నాడు. పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తోంది. రానాకు జోడీగా మళయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ నటిస్తోంది. అయితే ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా.. జనవరి 12 న విడుదల చేయాలని మొదటగా చిత్ర యూనిట్ భావించింది.
అయితే తాజాగా పవన్ అభిమానుకు షాక్ ఇచ్చే వార్తను వెల్లడించింది భీమ్లా నాయక్ టీం. జనవరి 12న విడుదల కావాల్సిన ఈ మూవీని శివరాత్రి బరిలో నిలువనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి బరిలో రాధేశ్యాం, ట్రిపుల్ ఆర్ లాంటి బడా సినిమాలు ఉండటంతో పాటు భీమ్లానాయక్ వస్తే థియేటర్ల సమస్య వస్తుందని దిల్ రాజు భీమ్లా నాయక్ మూవీ టింను కన్విన్స్ చేశాడు. అయితే పవర్ స్టార్ సినిమా కోసం ఆత్రుతగా వేచిచూస్తున్న అభిమానులకు మాత్రం ఈ విషయం మింగుడుపడటం లేదు.
ఈసినిమాలో రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలను అందిస్తున్నారు. మరోవైపు థమన్ మ్యూజిక్ ఆల్ రెడీ హిట్ అయింది. సితార ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…