యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రాబోతోంది. బాహుబలి తర్వాత ‘సాహో’ సినిమాతో ప్రభాస్ కాస్త నిరాశకు గురయ్యాడు. ఆ నిరాశను సినిమాతో పూడ్చుకోవాలని రాధేశ్యామ్ ప్లాన్ చేశాడు ప్రభాస్. ఈ మేరకు జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమాలో భాగమై ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్స్ తో అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు.
ఈ నేపథ్యంలో తాజాగా సీనియర్ నటుడు కృష్ణంరాజు తన లుక్‌ని రివీల్ చేసి సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు వచ్చేలా చేశాడు. రెబల్ స్టార్ కృష్ణంరాజు మహాజ్ఞాని పరమహంస పాత్రలో రాధేశ్యామ్ చిత్రంలో కనిపించబోతున్నారు. ఈ పోస్టర్‌లో కృష్ణంరాజు గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు.
ఈ పాత్ర కోసం ఏడాది పాటు గడ్డం పెంచాడు కృష్ణంరాజు. పాత్రకు సరిగ్గా సరిపోతుందని అనిపించిన అతని లుక్ విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెబల్ స్టార్ అభిమానులు ఈ పోస్టర్ చూసి సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణంరాజు సమర్పణలో ప్యాన్ ఇండియా మూవీగా భారీ ఎత్తున విడుదలైంది.
ఇప్పటికే విడుదలైన ప్రభాస్ లుక్స్, పాటలు సినిమాపై హైప్ పెంచాయి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. వంశీ, ప్రమోద్, ప్రసిద నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. కృష్ణంరాజు గతంలో ప్రభాస్‌తో ‘బిల్లా’, ‘రెబల్’ చిత్రాల్లో నటించారు. గణపతిగా అతడు చివరిసారిగా 2015లో వచ్చిన ‘రుద్రమదేవి’ సినిమాలో కనిపించాడు. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించనుండడంతో అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…