కరోనా కారణంగా ఇంటికే పరితమైన చాలామంది అఖండ సినిమాతో దాదాపు థియేటర్లకు వస్తున్నారనే చెప్పాలి. తర్వాత పుష్ప సినిమాతో ఉన్న ఆ చిన్న పాటి భయం కూడా జనాల్లో పోయిందనే చెప్పాలి. ఇక క్రిస్మస్ కు ముందు డిసెంబర్ 24న విడుదల కాబోయే మరో ప్యాన్ ఇండియా మూవీ శ్యామ్ సింగరాయ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా పూర్తి చేసేశారు.
తర్వాత జనవరిలో ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల కానుంది. సంక్రాంతి బరిలో కూడా చాలా సినిమాలు రానున్నాయి. అందులో పవన్ కళ్యాన్ సినిమా భీమ్లా నాయక్ విడదుల అవుతుంది అనుకున్నారు. కానీ తెలిసిన సమాచారం ప్రకారం ఆ సినిమా విడుదల తేదీని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇక విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ ఎఫ్2. దీనికి సీక్వెల్ గా వస్తున్న మరో సినిమా ఎఫ్3.
దీనికి సంబంధించి ఇప్పటికే షూటింగ్ పనులు అత్యత వేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్లుగా తమన్నా, మెహరీన్ లు నటించారు. వీరితో పాటు అంజలి, ప్రసాద్‌గా రాజేంద్రప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్, మురళీ శర్మ, సంగీత, అలీ, తులసి, సత్య, ప్రదీప్, ప్రగతి, వై. విజయ, అన్నపూర్ణ, వెన్నెల కిషోర్, రఘుబాబు, శ్రీకాంత్ అయ్యంగార్ మరియు రచ్చ రవి కూడా ఉన్నారు. ఇది పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌లో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మిస్తున్న చిత్రం ఎఫ్3 శాటిలైట్ హక్కులను జీ తెలుగు , జీ సినిమాలకు విక్రయించారు. స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు ఈ సనిమాపై అంచనాలను పెంచాయి. తాజాగా విడుదల తేదీకి సంబంధించి పోస్టర్ విడుదలైంది. ఈ సినిమాను ఏప్రిల్ 29, 2022లో విడుదల చేయనున్నట్లు పోస్టర్ విడుదల చేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…