నందమూరి నట సింహం బాలకృష్ణ అఖండ సినిమాలో భారీ హిట్ కొట్టాడు. బాక్సాఫీస్ వద్ద అఖండ సినిమా వసూళ్ల కిక్ ఇచ్చింది. ఇటు సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటిన బాలయ్య బాబు.. ఓటీటీలో కూడా దుమ్ము రేపుతున్నాడు. ఇటీవల ఆహా ఓటీటీలో మొదలైన ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ టాక్ షో సక్సెస్ అయింది. తొలి షోలోనే కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో చేసిన టాక్ షో జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.
షోలో బాలకృష్ణ ఎనర్జీ లెవల్స్ పీక్స్ లో ఉంటున్నాయి. గెస్ట్ లుగా వచ్చినవారు బాలయ్య బాబు సందడి చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ షో ద్వారా ఇప్పటికే మెహన్ బాబు, నాని, బోయపాటి శ్రీను, బ్రహ్మానందం, ఎంఎం కీరవాణి, రాజమౌళి, అనిల్ రావిపూడి వంటి వారితో సరదాగా ముచ్చటించారు బాలకృష్ణ.
అఖండ టీం టాక్ షోలో హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ తో స్టెప్పులు కూడా వేసి అందరిని మెప్పించారు. ఇక ఇటీవలే ఈషోలో మాస్ మాహారాజా రవితేజ.. డైరెక్టర్ గోపిచంద్ మలినేని సైతం సందడి చేశారు. ఈ షో డిసెంబర్24న ప్రసారం కానుంది. ఇదిలా ఉంటే అన్ స్టాపబుల్ నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈషోకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా రాబోతున్నారు.
దీనికి సంబంధించిన షోను క్రిస్మస్ కానుగా ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నారు. బన్నీతో పాటు పుష్ప టీం కూడా సందడి చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పుష్ప సినిమా హిట్ తో బన్నీ తన సత్తాను చాటాడు. దేశవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుని, భారీ వసూళ్లను రాబడుతోంది. ఓ వైపు అఖండ… మరో వైపు పుష్ప ఇలా ఇద్దరి మధ్యలో టాక్ షో ఏవిధంగా ఉండబోతోందో అని అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…