General News

RCB ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్! జట్టును అమ్మేస్తున్నారా? కొత్త యజమాని ఎవరు?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఐపీఎల్‌లో మోస్ట్ పాపులర్ టీమ్స్‌లో ఒకటి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కలను నిజం చేస్తూ ఈసారి ఐపీఎల్ టైటిల్‌ను కొట్టేసింది. ఆర్‌సీబీ టీమ్, ఫ్యాన్స్ సంబరాలకు అంతే లేకుండా పోయింది. కానీ ఇప్పుడు వింటుంటే.. ఆర్‌సీబీ ఫ్రాంచైజీనే అమ్మేయడానికి రెడీ అవుతున్నారట! ఇది నిజంగా షాకింగ్ కదా? కొత్త ఓనర్ రాబోతున్నాడా ఏంటి?

ప్రస్తుత ఓనర్ డియాజియో.. జట్టును అమ్మేయడానికి ఆలోచిస్తున్నారట. పూర్తిగా అమ్మేస్తారో.. లేక కొంత షేర్ మాత్రమే అమ్ముతారో చూడాలి. దీని విలువ సుమారు 2 బిలియన్ డాలర్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.16,384 కోట్లు అన్నమాట!

డియాజియో పీఎల్‌సీ వాళ్లు ఆర్‌సీబీలో కొంత వాటా లేదా పూర్తిగా అమ్మేయడానికి కొందరితో చర్చలు జరుపుతున్నారట. ఈ న్యూస్ బయటకు రాగానే యునైటెడ్ స్పిరిట్స్ షేర్ల ధరలు కూడా పెరిగాయి. ఒక్కసారిగా స్టాక్ ధర 3.3% పెరిగిందంటే చూడండి.. ఆర్‌సీబీకి ఎంత క్రేజ్ ఉందో!

అయితే.. ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని సమాచారం. దీని గురించి కంపెనీ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

గుర్తుండే ఉంటుంది.. 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు ఆర్‌సీబీ టీమ్‌ను విజయ్ మాల్యా కొన్నారు. ఆ తర్వాత ఆయన అప్పుల్లో కూరుకుపోవడంతో పరిస్థితి మారిపోయింది. అప్పుడు డియోజియో వాళ్లు స్పిరిట్స్ బిజినెస్‌ను కొనుగోలు చేసి ఆర్‌సీబీకి ఓనర్ అయ్యారు.

చూద్దాం ఏం జరుగుతుందో! ఆర్‌సీబీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago