Categories: Movie News

Burj Khalifa : బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఒకే ఒక్క ఇండియన్ యాక్టర్.. అన్ని కోట్లు పెట్టి కొన్నాడంటే మామూలోడు కాదు!

Burj Khalifa : దుబాయ్ అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది బుర్జ్ ఖలీఫానే కదా! ఆకాశాన్ని తాకుతున్నట్టుండే 828 మీటర్ల ఎత్తు, 163 అంతస్తులు… ఇది దుబాయ్‌కే కాదు, ప్రపంచానికే తలమానికం. దీన్ని కట్టడానికి దాదాపు ఆరేళ్లు పట్టింది. 2004లో మొదలుపెట్టి 2010లో పూర్తి చేశారు.

The only Indian actor to buy a flat in Burj Khalifa..

బుర్జ్ ఖలీఫా అంటే సామాన్యులకే కాదు, సెలబ్రిటీలకు కూడా ఓ క్రేజ్. దుబాయ్ వెళ్లిన వాళ్లంతా అక్కడ ఓ ఫోటో దిగాల్సిందే. అందుకే చాలా మంది కోటీశ్వరులు, సెలబ్రిటీలు అక్కడ ఫ్లాట్స్ కొంటున్నారు. మన భారతీయ నటుల్లో ఒక సూపర్ స్టార్ కూడా బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్నారని మీకు తెలుసా?

అవును, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ బుర్జ్ ఖలీఫాలో ఒక సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొన్నారు. దానికోసం ఆయన దాదాపు రూ.3.5 కోట్లు ఖర్చు చేశారు. అంతేకాదు, ఆ ఫ్లాట్‌ను తన భార్య సుచిత్ర పేరు మీద రిజిస్టర్ చేయించారు. ఇది మాత్రమే కాదు, దుబాయిలో ఆయనకు మరో పెద్ద విల్లాలో 3 బీహెచ్‌కే ఫ్లాట్ కూడా ఉంది.

బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఏకైక భారతీయ నటుడిగా మోహన్ లాల్ రికార్డు సృష్టించారు. టాలీవుడ్ హీరోలైన మహేశ్ బాబు, అల్లు అర్జున్‌లకు కూడా దుబాయిలో అపార్ట్‌మెంట్స్ ఉన్నాయని టాక్ నడుస్తోంది. కానీ దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక మోహన్ లాల్ సినిమాల విషయానికొస్తే… మధ్యలో ఆయనకు కొన్ని ఫ్లాప్స్ వచ్చినా, ఇప్పుడు మళ్లీ హిట్స్ కొడుతున్నారు. ఆయన నటించిన ‘ఎల్ 2 ఎంపురాన్’, ‘తుడరమ్’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపాయి.

ఏదేమైనా, బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న మన మోహన్ లాల్ గ్రేట్ కదా!

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago