Burj Khalifa : దుబాయ్ అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది బుర్జ్ ఖలీఫానే కదా! ఆకాశాన్ని తాకుతున్నట్టుండే 828 మీటర్ల ఎత్తు, 163 అంతస్తులు… ఇది దుబాయ్‌కే కాదు, ప్రపంచానికే తలమానికం. దీన్ని కట్టడానికి దాదాపు ఆరేళ్లు పట్టింది. 2004లో మొదలుపెట్టి 2010లో పూర్తి చేశారు.

బుర్జ్ ఖలీఫా అంటే సామాన్యులకే కాదు, సెలబ్రిటీలకు కూడా ఓ క్రేజ్. దుబాయ్ వెళ్లిన వాళ్లంతా అక్కడ ఓ ఫోటో దిగాల్సిందే. అందుకే చాలా మంది కోటీశ్వరులు, సెలబ్రిటీలు అక్కడ ఫ్లాట్స్ కొంటున్నారు. మన భారతీయ నటుల్లో ఒక సూపర్ స్టార్ కూడా బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్నారని మీకు తెలుసా?
అవును, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ బుర్జ్ ఖలీఫాలో ఒక సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొన్నారు. దానికోసం ఆయన దాదాపు రూ.3.5 కోట్లు ఖర్చు చేశారు. అంతేకాదు, ఆ ఫ్లాట్‌ను తన భార్య సుచిత్ర పేరు మీద రిజిస్టర్ చేయించారు. ఇది మాత్రమే కాదు, దుబాయిలో ఆయనకు మరో పెద్ద విల్లాలో 3 బీహెచ్‌కే ఫ్లాట్ కూడా ఉంది.
బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న ఏకైక భారతీయ నటుడిగా మోహన్ లాల్ రికార్డు సృష్టించారు. టాలీవుడ్ హీరోలైన మహేశ్ బాబు, అల్లు అర్జున్‌లకు కూడా దుబాయిలో అపార్ట్‌మెంట్స్ ఉన్నాయని టాక్ నడుస్తోంది. కానీ దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక మోహన్ లాల్ సినిమాల విషయానికొస్తే… మధ్యలో ఆయనకు కొన్ని ఫ్లాప్స్ వచ్చినా, ఇప్పుడు మళ్లీ హిట్స్ కొడుతున్నారు. ఆయన నటించిన ‘ఎల్ 2 ఎంపురాన్’, ‘తుడరమ్’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపాయి.
ఏదేమైనా, బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొన్న మన మోహన్ లాల్ గ్రేట్ కదా!
Happy Birthday, Dear Suchi ❤️ pic.twitter.com/FisrUpJRYw
— Mohanlal (@Mohanlal) June 3, 2025































