General News

కామంతో కీచకుడిలా మారిన 60 ఏళ్ల వృద్ధుడు! మహిళలు ఏం చేశారో తెలుసా? షాకింగ్ న్యూస్!

60 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి కామంతో కళ్లు మూసుకుపోయి, దారుణాలకు ఒడిగట్టాడు. నాలుగేళ్ల క్రితం అతని భార్య చనిపోయింది. కృష్ణారామా అంటూ భక్తి మార్గంలో నడవాల్సింది పోయి, కామ కోరికలతో విచ్చలవిడిగా ప్రవర్తించాడు. ఊళ్లో ఎవరైనా అమాయక మహిళలు కనిపిస్తే చాలు, వారిని వేధించడం, లైంగికంగా అనుభవించడం అతనికి సరదాగా మారిపోయింది.

ఇలాంటి కామాంధుడిని మట్టిలో కలిపేయాలని ఆరుగురు బాధితులు నిర్ణయించుకున్నారు. తమలాగే మరికొంతమంది బాధితులు కూడా ఉండటంతో వారందరూ కలిసి నేరుగా ఆ దుర్మార్గుడి ఇంటికి వెళ్లారు. అతనికి బుద్ధి వచ్చేలా చితకబాదారు. అంతేకాదు, బతికుండగానే తగలబెట్టేసి తమ కళ్లారా చూశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ షాకింగ్ ఘటన ఒడిశాలో జరిగింది. 60 ఏళ్ల వృద్ధుడి భార్య నాలుగేళ్ల క్రితమే చనిపోయింది. అప్పటినుంచి ఒంటరిగా ఉంటున్న అతడు కామాంధుడిగా మారాడు. ఊళ్లో ఏ మహిళ కనిపిస్తే ఆమెపై కన్నేసి, ఎలాగైనా అనుభవించాలని అనుకునేవాడు. ఎవరైనా ఒంటరిగా కనిపిస్తే చాలు, వారి దగ్గర తన కామరూపాన్ని చూపించేవాడు. ఇష్టం వచ్చినట్లు అసభ్యంగా తాకేవాడు. అర్ధరాత్రిళ్లు ఎవరైనా ఇంట్లో ఒంటరిగా ఉన్నారని తెలిస్తే చాలు, అక్కడికి వెళ్లి అత్యాచారానికి పాల్పడేవాడు. ఇలా ఐదుగురు మహిళలను అనుభవించాడు. పరువు పోతుందని భయపడి బాధితులు తమ బాధను లోలోపలే దిగమింగుకున్నారు.

జూన్ 3వ తేదీన 52 ఏళ్ల ఓ వివాహితపై కూడా ఈ కామ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం మిగతా బాధితులకు తెలియడంతో అతన్ని చంపేయాలని డిసైడ్ అయ్యారు. పక్కా ప్లాన్ ప్రకారం నిందితుడి ఇంటికి వెళ్లి అతడిపై దాడి చేశారు. దేహమంతా చితకబాదారు. ఆ తర్వాత తమ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలోకి అతడిని తీసుకెళ్లారు. అక్కడ ఓ చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేశారు.

అయితే, ఆ వృద్ధుడు కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. విచారణలో బాధితురాళ్లు నిజం చెప్పేశారు. హత్య చేసిన ఆరుగురు మహిళలతోపాటు వారికి సహకరించిన మరో ఇద్దరు మహిళలు, పురుషులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మహిళలు తమపై జరిగిన అన్యాయానికి ఎలా తిరగబడ్డారో ఈ ఘటన తెలియజేస్తుంది.

ఈ కథనం సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను, వాటి పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహాన్ని తెలియజేస్తుంది. చట్టం తన పని తాను చేసినప్పటికీ, బాధితులు సొంతంగా న్యాయం కోసం ఎలా పోరాడుతున్నారో ఇది చూపిస్తుంది.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

1 month ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

1 month ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

1 month ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

1 month ago