రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తో భారత్ లోనే కాదు ప్రపంచమంతా అభిమానులను సంపాదించుకున్నాడు.మిగతా హీరోలకు రాని అరుదైన అవకాశం బాహుబలి సినిమా తో ప్రభాస్ తన సొంతం చేసుకున్నాడు. బాహుబలి కంటే ముందు ఒక తరహా సాంఘిక చిత్రాలను మాత్రమే ప్రభాస్ చేశాడు కానీ పౌరాణిక చిత్రాలు చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. జానపద చిత్రం బాహుబలి తీయడంతో ప్రభాస్ పౌరాణిక పాత్రలు చేయగలడు అనే ఆలోచనకు ఆది పురుష్ దర్శక నిర్మాతలు వచ్చి ఉండొచ్చు.
ఇకపోతే పౌరాణిక చిత్రాలు టాలీవుడ్ లో వచ్చినన్ని మరే చిత్రరంగంలో రాలేదంటే అతిశయోక్తి కాదు. ఆనాడు నందమూరి తారక రామారావు తెలుగులో లవకుశ సినిమా తీసి శ్రీరాముడిగా చిరస్థాయిగా ప్రేక్షకుల గుండెల్లో ఒదిగిపోయారు. లవకుశ సినిమా హిందీలో లో పునర్నిర్మాణము చేస్తే అంతగా ప్రజాదరణ పొందలేదు.తమిళ,కన్నడ భాషల్లో పునర్నిర్మించిన తెలుగులో మాత్రమే సూపర్ హిట్ అయ్యింది.
వివరాల్లోకి వెళితే 400 కోట్ల బడ్జెట్ తో వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ఒక సినిమా,రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ అనే మరొక సినిమా ట్రాక్ లో ఉండగా ఇప్పుడు ఆదిపురుష్ అనే ఫ్యాన్ ఇండియా మూవీ రాబోతున్నట్టు అనౌన్స్ మెంట్ జరిగింది.ప్రధానమంత్రి నరేంద్రమోడీ అయోధ్యలో లో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో భారతదేశం మొత్తం కూడా రామనామ జపం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆది పురుష్ సినిమా అనౌన్స్ మెంట్ జరగడంతో ఇండియా మొత్తం ఈ సినిమా గురించే చర్చిస్తున్నారు.
ఆది పురుషుడిగా పిలువబడే శ్రీరాముడి పాత్ర చేయడం నేలవిడిచి సాముచేయడం లాంటిది. ఆ పాత్రకు ఆంగికం,వాచకం ఎంతో అవసరం ఉంటుంది. శ్రీరాముడు అనగానే ఆజానుబాహుడి రూపం కళ్ళలో మెదులుతూ ఉంటుంది.అలాంటి రూపం ప్రభాస్ కు ఉన్నప్పటికీ వాచకం(డైలాగ్స్)కూడా అంతే ముఖ్యం. మహోన్నత ఉత్తమ సౌశీల్య సుగుణ సుందర మైన శ్రీరాముడి పాత్రను చేసి ప్రభాస్ మెప్పించగలడా అన్నదే ఇప్పుడు సగటు భారతీయ ప్రేక్షకుడి సందేహం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…