బాలీవుడ్ లో బాడీ బిల్డర్స్ అంటే అందరికీ టక్కున గుర్తుకొచ్చేది సల్మాన్ ఖాన్ అయితే సిక్స్ ప్యాక్ అంటే మాత్రం హృతిక్ రోషనే కళ్ళ ముందుంటాడు. ఒక్క భారత్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా యంగ్ ఏజ్ లో తన బాడీని సరిక్రొత్త రూపాలలో ప్రదర్శిస్తూ.. తన ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు. ఈమధ్య విడుదలైన ‘వార్’ చిత్రంలో తన అద్భుతమైన డ్యాన్స్, ఫిట్ నెస్ బాడీతో అందరితోనూ శభాష్ అనిపించుకున్నాడు. హృతిక్ బాడీ చూసినవాళ్ళెవ్వరికైనా అసలు ఈ హీరో రోజూ ఏం తింటున్నాడు.? ఎలాంటి వర్కవుట్స్ చేస్తున్నాడు.? అని యువతరమంతా ఆశ్చర్యపోతుంటారంటే అతిశయోక్తికాదేమో.! 21వ శతాబ్దంలోని యువతరమంతా హృతిక్ అద్భుతమైన స్టైల్ ను తప్పకుండా ఫాలో అవుతున్నారు.
ఈ జనరేషన్ వారే కాదు రాబోయే తరాల వారికి కూడా ఆయన స్టైల్ ఒక సెన్సెషనల్ మారుతుందని తాజాగా సోషల్ మీడియాలోని హృతిక్ దేహ ధారుడ్యాన్ని చూసి అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికీ ప్రతి అమ్మాయి కోరుకునే పర్ఫెక్ట్ స్టైల్ తో పాటు తన బాడీని మెయింటెన్ చేస్తున్నాడు హృతిక్. అందుకే అతనంటే అమ్మాయిలకు అంత పిచ్చి. ఆసియాలోనే ‘మోస్ట్ సెక్సీయెస్ట్ మెన్‘ గా తనను టాప్ నెంబర్ 1 ప్లేస్ లో వున్నాడు. అతని కళ్లు, డ్యాన్స్, హృతిక్ స్టైల్ అమ్మాయిలను చూపు తిప్పుకోకుండా చేస్తాయి. మరి ఈ హీరో తన సిక్స్ ప్యాక్ బాడీ కోసం జిమ్ లో ఎలాంటి వర్కవుట్స్ చేస్తాడో.. ఎటువంటి ఆహారం తీసుకుంటాడో.. మొదలైన సందేహాలు మీకూ వున్నాయా.? అయితే.. ‘క్రిష్ 2’ చిత్రం షూటింగ్ ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో హీరో హృతిక్ తన సిక్స్ ప్యాక్ సీక్రెట్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. ఆ సీక్రెట్స్ ఏమిటో అన్నీ చదివి మీరే తెలుసుకోండి..
హృతిక్ క్రమం తప్పకుండా లైట్ ఫుడ్ నే తీసుకుంటాడు. దీని వల్ల జీవక్రియ స్థిరంగా ఉంటుంది. వ్యాయామా శిక్షకుని సూచనల మేరకు రోజుకు 6 నుండి 7 సార్లు లైట్ ఫుడ్ తీసుకుంటాడు.
హృతిక్ రోషన్ తన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ప్రపంచ ప్రఖ్యాత ఫిట్ నెస్ క్రిస్ జెన్ హిన్ తో వ్యాయామ శిక్షణ తీసుకున్నాడు. ‘క్రిష్-2’ చిత్రం కోసం తన బాడీ పర్ఫెక్ట్ సైజ్ వచ్చేవరకు వారంలో 4 రోజులు, రోజుకు 2 సార్లు వ్యాయామ శిక్షణ తీసుకున్నాడు.
హృతిక్ రోషన్ తన శరీరాన్ని ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా ఉంచడానికి సరైన వర్కవుట్స్ తో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకుంటాడు.
హృతిక్ రోషన్ ప్రతిరోజూ హార్డ్ వర్కవుట్స్ చేస్తాడు. కార్డియో, స్ట్రెచింగ్, పవర్ వర్కౌట్స్ లను చేస్తాడు. అందుకే అతని కండరాలు కాంపాక్ట్ & బ్యూటిఫుల్ గా ఉంటాయి. అందరూ చేసే కార్డియో వర్కవుట్స్ ను హృతిక్ ప్రతిరోజూ కనీసం అరగంటకు పైగా అదనంగా చేస్తాడు. ఈ రకమైన శిక్షణ అనేది మొత్తం శరీరం పాల్గొనే ఒక వ్యాయామం. ఈ సర్క్యూట్ శిక్షణ అనేది శరీరం మొత్తం కండరాలు పెరగడానికి మరియు కండరాలను మెరుగు పరచడానికి సహాయ పడుతుంది. ఈ వర్కవుట్ తో అన్ని కండరాలు అద్భుతంగా పని చేస్తాయి. ఈ శిక్షణలో ప్రతిదాన్ని మీరు 10 నుండి 15 నిమిషాలు లేదా సుమారు అరగంట సేపు చేయండి.
హృతిక్ తన చేతుల్లోని కండరాలను మంచిస్థితిలో ఉంచడానికి స్ట్రెయిట్ ఆర్మ్ డంబెల్ పుల్లోవర్, స్ట్రెయిట్ ఆర్మ్ పుల్ డౌన్ వంటి చాలా హార్డ్ ఆర్మ్ వర్కవుట్స్ చేస్తాడు. వీటి వల్ల చేతుల్లో కొవ్వులు కరిగి కండరాలు మంచి స్థితిలో ఉన్నాయి.
హృతిక్ ఎప్పుడూ పోషకమైన ఆహారాన్ని తినడానికే ఇష్టపడతాడు. పాన్ కేక్‌తో చక్కెర లేని సిరప్, అరటి చీలికలతో కూడిన ప్రోటీన్ పౌడర్, పెరుగు, మీట్‌బాల్స్ వంటి వాటిని రెగ్యులర్ గా తీసుకుంటాడు.
హృతిక్ ఎప్పుడూ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ డైట్ చేస్తాడు. దీనికి కారణం ఇందులో సహజ చక్కెర, ఫైబర్ అధికంగా ఉంటుంది. నేటివ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ డైట్‌లో దంపుడు బియ్యం, వోట్స్, సలాడ్ ఉన్నాయి.
కండరాల పెరుగుదలకు ప్రోటీన్లు అవసరం. వర్కవుట్ తర్వాత ఈ ప్రోటీన్ వ్యాయామం చేయడం వల్ల కండరాల నష్టాన్ని నివారించవచ్చు. హృతిక్ ప్రోటీన్లో ప్రోటీన్ పౌడర్, టర్కీ, ఫిష్, గుడ్డు తెల్లసొన అధికంగా ఉంటాయి. ఈ ఆహారాలు కండరాల సాంద్రతను పెంచుతాయి. శరీర శక్తిని పెంచుతాయి. చదివారు కదా.. మన బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ సిక్స్ ప్యాక్ సీక్రెట్స్ ను.. మరి వీలైతే మీరూ పై టిప్స్ ను పాటించే ప్రయత్నం చేయండి. ఆరోగ్యంగా వుండండి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…