Movie News

Baladitya : ఆ రోజు నా రెండు చంపలు వాచేలా ఆ దర్శకుడు కొట్టాడు…!

Baladitya : బాల నటుడుగా తెలుగు తెరకు పరిచయమైన బాలాదిత్య ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్ళాం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ అయ్యాడు. ఇక సుమారు 40 సినిమాల్లో బాల నటుడుగా నటించాడు. అన్న, లిటిల్ సోల్జర్స్ సినిమాలకు నంది అవార్డులను కూడా అందుకున్న బాలాదిత్య ఆ తరువాత హీరోగా కూడా పలు సినిమాలు చేసారు. చంటిగాడు, సుందరానికి తొందరెక్కువ, 1940 లో ఒక గ్రామం వంటి సినిమాలు గుర్తింపు తెచ్చాయి. అయితే ఇందులో 1940 లో ఒక గ్రామం సినిమాకు నంది అవార్డు కూడా వరించింది. ఇక ఈటీవీలో ఛాంపియన్ అనే క్విజ్ ప్రోగ్రామ్ కి యాంకర్ గా కూడా వ్యవహారించాడు బాలాదిత్య. ఇక పలు సీరియల్స్ లో కూడా నటించిన బాలాదిత్య తన సినిమా అనుభవాలను తెలిపారు.

బాల చందర్ గారు చంప వాచేలా కొట్టారు…

బాలాదిత్య చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు పెద్ద దర్శకుల సినిమాలలో చేసారు. ఇక అలాంటప్పుడే బాల చందర్ గారి సినిమాలో నటించిన ఆయన ఒక సన్నివేశంలో బాగా నటించినా అతను నిల్చొవాల్సిన స్థానంలో నిలబడకుండా వేరే చోట నిలబడి నటించడం వల్ల పక్కన ఉన్న మరో ఆర్టిస్ట్ పై ఇతని నీడ పడి సీన్ సరిగా రాకపోవడంతో బాల చందర్ గారికి కోపం వచ్చి చంప మీద కొట్టారట. బాగా చేసావ్, ఎందుకు రా మార్కులో నిలబడలేదు అంటూ అరిచారట. ఇక ఈ సంఘటన తరువాత బాలాదిత్య జీవితంలో ఎప్పుడు తనకు మార్క్ చేసిన ప్లేసులో నిలబడి నటించరాట. నటించేప్పుడు ప్రతిసారి ఆ చంప దెబ్బ గుర్తుకు వచ్చి పర్ఫెక్ట్ గా ఒక సీన్ చేయగలుగుతున్నానని చెప్పారు.

ఇక ఈవివి సత్యనారాయణ గారు కూడా సెట్స్ లో చాలా కోపంగా ఉండేవారని ఏమండి ఆవిడ వచ్చింది సినిమా టైములో రంభ గారి మీద అరిచేసారని చెప్పారు. ఇక మధుసూదన్ రావు గారితో హిందీ లవకుశ లో నటించినపుడు ఊటి లో షూటింగ్ సమయంలో తిట్లు తిన్న అనుభవాలను చెప్పారు. మధుసూదన్ రావు గారిని చూసి ఒకప్పుడు రామారావు గారు, నాగేశ్వరావు గారే భయపడేవారు, నిన్ను తిట్టడం ఏముందిలే అని కే ఎస్ రావు గారు బుజ్జగించేవారట బాలదిత్యను. ఇక డైరెక్టర్ తేజ గారు కూడా సెట్ లో సరిగా చేయక పోతే కొడతారు, వీళ్లందరు వర్క్ మైండెడ్ కావడం వల్ల అలా సెట్స్ లో ఉంటారు అంతే కానీ కొట్టడం వాళ్లకు సరదా కాదు. పని మీద వాళ్లకు ఉన్న శ్రద్ధ అది అంటూ తన అనుభవాలను పంచుకున్నాడు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago