Featured

Youtuber Prashu Baby : యూట్యూబ్ లో ఎప్పుడూ ట్రెండింగులో వుండే ప్రశు బేబీ… సక్సెస్ వెనుక కష్టం గురించి తెలుసా..?

Youtuber Prashu Baby : ఒకప్పుడు సినిమాలాలో అవకాశాలు రావాలి అన్నా, నలుగురిలో గుర్తింపు తెచ్చుకోవాలి అన్నా చాలా కష్టపడాల్సి వచ్చేది. అందరి చుట్టూ కాళ్ళు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి. అయితే ఇపుడు సోషల్ మీడియా ఇలాంటి వారికి మంచి మార్గం అనే చెప్పుకోవాలి. ఎంతో మంది సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్ తో మంచి పేరు సంపాదించుకున్నారు. యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ రీల్స్, లలో షార్ట్ వీడియోలు చేస్తూ స్టార్ ఇమేజ్ తో పాటు, మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. ఈ కోవలోకే వస్తారు యూట్యూబర్ ప్రశు బేబీ. ప్రశు బేబీ పేరుతో యూట్యూబ్లో షార్ట్ వీడియోలు చేస్తూ పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. అయితే ఇంత పాపులరిటీ తెచ్చుకోవడం కూడా అంత సులభం కాదు. అసలు ఈ ప్రశు బేబీ ఎవరు అనేదాని మీద అందరిలో ఆసక్తి పెరిగింది.

టిక్ టాక్ తో మొదలైన ప్రయాణం…

ప్రశు బేబీ పేరుతో యూట్యూబ్ లో వీడియోలు చేసే ప్రశు పూర్తి పేరు ప్రశాంత్. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన ప్రశు, అందరిలాగే ఇంజనీరింగ్ చదివాడు. చదువు పూర్తి అయిన తరువాత కొన్ని రోజులు ఉద్యోగ వేట కూడా ప్రారంభించాడు. అయితే ఆ క్రమంలోనే కొంతమంది స్నేహితుల సలహా తో టిక్ టాక్ లో వీడియోలు చేయడం మొదలుపెట్టాడు. టిక్ టిక్ లో ఎమోషనల్ వీడియోలతో బాగా పేరు సంపాదించుకున్నాడు. అయితే అంత బాగుంది అన్న సమయంలో ప్రభుత్వం టిక్ టాక్ ను బ్యాన్ చేసింది.

ఆతరువాత తన ప్రయాణం టిక్ టాక్ నుండి యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ రీల్స్ కు మార్చేసాడు. ఈ సారి ఎమోషనల్ కాకుండా దారి మార్చి యూట్యూబ్ లో షార్ట్ వీడియోలు చేయడం ప్రారంవించాడు. మొదట్లో ప్రశాంత్ నెటిజన్ ల నుంచి అనేక విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. అయినా వెనకడుగు వేయకుండా లాక్ డౌన్ సమయంలో చిన్ని వీడియోలు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ కు 43 లక్షల మంది సబ్ స్కైబర్లు వున్నారు. గతంలో దొంగబాబా స్కామ్ లు, స్నేహితుల మధ్య బాండింగ్, చిన్న పిల్లల వీడియోస్ చాలా వినోదాత్మకంగా చూపించిన ప్రశు బేబీ ప్రస్తుతం పెళ్లి చూపులు, పెళ్లైన కొత్తలో, పెళ్లి తరువాత లాంటి వీడియోలు చేస్తున్నాడు. రోజూ యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోలలో ప్రశు వీడియోలు వుండాల్సిందే, అంతలా సక్సెస్ అయ్యాడు ప్రశాంత్.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago