Balagam fame Kota Jayaram : తెలంగాణ పల్లె వాతావరణం, సంస్కృతిని సహజంగా చూపించి సక్సెస్ అయ్యాడు దర్శకుడు వేణు. ఒక మనిషి చనిపోయినపుడు ఇంట్లోని కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలా ఫీల్ అవుతారు లాంటి విషయాలను చాలా సునిశితంగా చూపించారు. బలగం సినిమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని కాకుండా దేశ విదేశాలలో చాలా మందికి నచ్చుతోంది. ఇక తెలంగాణ పల్లెల్లో అయితే గ్రామంలో అందరూ కలిసి సినిమా చూస్తూ ఎమోషనల్ అవుతున్నారు. అంతలా సినిమా అందరికీ కనెక్ట్ అయి ఆర్టిస్టులకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కూడా అంతగా రాని గుర్తింపు ఈ ఒక్క సినిమతో చాలా మంది ఆర్టిస్టులకు గుర్తింపు వచ్చింది. అలా సినిమాలో హీరోకి తండ్రిగా ఐలయ్య పాత్రలో నటించిన కోట జయరాం గారు బాగా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఆయన పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆయన కెరీర్ గురించి మాట్లాడారు.
500 ఇస్తామంటే ఒప్పుకోలేదు…
సీరియల్స్ తో కెరీర్ మొదలు పెట్టిన జయరాం గారు దాదాపు 40 సీరియల్స్ ను చేశారట. అందులోనూ ఈటీవీ ఛానెల్ లోనే ఎక్కువగా సీరియల్స్ చేసిన ఆయన అందులో ‘ఆడదే ఆధారం’ సీరియల్ మంచి పేరు తెచ్చిపెట్టింది అంటూ చెప్పారు. అయితే ఒకానొక సమయంలో అన్నీ పోలీసులు పాత్రలే వస్తున్నపుడు అదే ప్రొడక్షన్ వారు మళ్ళీ పోలీసులు పాత్ర ఇస్తుంటే వారితో గొడవపడి నాకు వేరే పాత్రలు ఇవ్వండి చేయగలను నేను చేస్తానని నమ్మకం ఉంటేనే పెట్టుకోండి మొదట చూడండి అని చెప్పేవారట.
అలాగే సీరియల్స్ లో రోజు రెమ్యూనరేషన్ ఉంటుంది అలా 500 ఇచ్చే సమయంలో ఒక సీరియల్ లో చేసేటపుడు 1000 రూపాయలు డిమాండ్ చేశారట. అది కూడా నా పెర్ఫార్మన్స్ చూసి ఆ తరువాత ఇవ్వండి లేకపోతే లేదు అని చెప్పి ఛాలెంజ్ చేశారట. డైలాగులు రాగానే సీన్ చేసేసి ఎక్కడా టేక్స్ తీసుకోకుండా చాలా బాగా చేశారట జయరాం. అలా చేసేసరికి ఆ కో డైరెక్టర్ వాళ్ళు పిలిచి 1000 రూపాయలు ఇచ్చి పంపారట. అలాంటి ఎన్నో సంఘటనలను ఎదుర్కొన్న జయరాం గారు నేడు బలగం సినిమాతో ఆయన నటనకు ఐలయ్య గా మంచి గుర్తింపు అందుకున్నారు.
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…
అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…
జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…