Singer Anitha Nagaraj : 2008 ఆ ప్రాంతంలో యువతను బాగా ఆకట్టుకున్న పాట ‘అనిత ఓ అనిత’. ఒక సినిమా పాటకూడా అంత వేగంగా ప్రాచుర్యం పొందదేమో అన్నట్లుగా అనిత అనే పాట ఆకట్టుకుంది. అప్పటికి ఇంకా స్మార్ట్ ఫోన్స్ అంత అందుబాటులో లేకపోయినా ఈ పాట అందరికీ చేరువయింది. అప్పట్లో ఈ పాట ఎవరు రాసారో, ఎక్కడినుండి ఈ పాట వచ్చిందో ఎవరికీ తెలియకపోయినా ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా ప్రపంచంలో ఆ పాట రాసి పడిన నాగరాజ్ అందరికీ పరిచయమయ్యాడు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాగరాజ్ ఈ పాట స్వయంగా తానే రాసి పాడటం విశేషం. ఇక ఈ పాటకు సంబంధించిన అనేక విషయాలను రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో నాగరాజ్ పంచుకున్నారు. అలాగే తన ఆర్థిక ఇబ్బందులను తెలియజేశారు.
బ్రతకడానికి పాన్ షాప్…
నాగరాజ్ అనే కంటే అనిత నాగరాజ్ అంటే బాగా గుర్తుకు వచ్చే అనిత నాగరాజ్ గారు ప్రస్తుతం అవకాశాలను వెతుక్కుంటూ తన ఊరి నుండి హైదరాబాద్ వచ్చారు. ఈటెల రాజేందర్ గారి ఊరు అయిన కమలాపురం పక్కన చిన్న గ్రామం నాగరాజు గారిది. పీజీ చేసిన ఆయన ఈ పాటతో బాగా ఫేమస్ అయినా కూడా ఆ ఫేమ్ ని సద్వినియోగం చేసుకోలేదు. ఆదిశగా ప్రయత్నాలు చేయలేదు. ఊర్లోనే పాన్ షాప్ పెట్టుకుని కుటుంబ పోషణ నిర్వహిస్తున్నారు.
ఆయనకు పెళ్ళై ఇద్దరు పిల్లలు కాగా ఇద్దరు పిలల్లో ఒకరు మూగ ఒకరు చెవిటి కావడం బాధాకరం. ప్రస్తుతం సోషల్ మీడియా బాగా పాపులర్ అవడంతో యూట్యూబ్ ఛానెల్స్ లో కూడా ప్రైవేట్ ఆల్బమ్స్ ఎక్కువయ్యాయి. అలా మళ్ళీ ఇతన పాటలను వినిపించాలని అనుకున్న నాగరాజ్ గారు ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ తో కలిసి పనిచేస్తున్నారు. అనిత పార్ట్ 2 పేరుతో పాటలను రాస్తున్నారు. తమ్ముడు హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి కావడం వల్ల తనతో ఉంటూ ఇండస్ట్రీలో అవకాశాలను వెతుక్కుంటున్నారు నాగరాజ్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…