Movie News

Allu Arjun: ఓన్లీ హగ్సేనా…. పార్టీ లేదా పుష్ప.. వైరల్ అవుతున్న ఎన్టీఆర్ ట్వీట్!

Allu Arjun: అల్లు అర్జున్ ఏప్రిల్ 8వ తేదీ పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.ఇలా పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా అభిమానులు సెలబ్రిటీలు అల్లు అర్జున్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ కు ఎన్టీఆర్ కాస్త ఆలస్యంగా శుభాకాంక్షలు చెప్పిన ఎంతో విభిన్నంగా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ హ్యాపీ బ‌ర్త్ డే బావా అల్లు అర్జున్ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.ఎన్టీఆర్ చేసిన ట్వీట్‌కు థాంక్యూ యువ‌ర్ లౌల్లీ విషెష్ బావా… వార్మ్ హ‌గ్స్ అంటూ ప్రేమగా  రిప్లై ఇచ్చాడు .

ఈ విధంగా అల్లు అర్జున్ రిప్లై ఇవ్వడంతో వెంటనే ఎన్టీఆర్ ఓన్లీ హగ్సేనా… పార్టీ లేదా పుష్ప అంటూ స్మైలీ ఎమోజితో మరొక పోస్ట్ చేశారు. దీంతో అల్లు అర్జున్ వెంటనే వస్తున్న అంటూ రిప్లై ఇచ్చారు.ఇలా వీరిద్దరూ వేదికగా చేసుకున్నటువంటి ఈ సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Allu Arjun:బావ అంటూ ఆప్యాయంగా పిలుచుకున్న హీరోలు…

ఈ విధంగా ఇద్దరు స్టార్ హీరోలు ఏ విధమైనటువంటి ద్వేషం ఈర్ష లేకుండా ఎంతో ఆప్యాయంగా బావా బావా అంటూ పిలుచుకోవడంతో ఇద్దరు హీరోల అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా మంచి స్నేహితులనే విషయం మనకు తెలిసిందే. ఇక ప్రస్తుతం ఇద్దరు హీరోలు తమ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago