Allu Arjun: అల్లు అర్జున్ ఏప్రిల్ 8వ తేదీ పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.ఇలా పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా అభిమానులు సెలబ్రిటీలు అల్లు అర్జున్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ కు ఎన్టీఆర్ కాస్త ఆలస్యంగా శుభాకాంక్షలు చెప్పిన ఎంతో విభిన్నంగా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ హ్యాపీ బర్త్ డే బావా అల్లు అర్జున్ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.ఎన్టీఆర్ చేసిన ట్వీట్‌కు థాంక్యూ యువర్ లౌల్లీ విషెష్ బావా… వార్మ్ హగ్స్ అంటూ ప్రేమగా రిప్లై ఇచ్చాడు .
ఈ విధంగా అల్లు అర్జున్ రిప్లై ఇవ్వడంతో వెంటనే ఎన్టీఆర్ ఓన్లీ హగ్సేనా… పార్టీ లేదా పుష్ప అంటూ స్మైలీ ఎమోజితో మరొక పోస్ట్ చేశారు. దీంతో అల్లు అర్జున్ వెంటనే వస్తున్న అంటూ రిప్లై ఇచ్చారు.ఇలా వీరిద్దరూ వేదికగా చేసుకున్నటువంటి ఈ సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Allu Arjun:బావ అంటూ ఆప్యాయంగా పిలుచుకున్న హీరోలు…
ఈ విధంగా ఇద్దరు స్టార్ హీరోలు ఏ విధమైనటువంటి ద్వేషం ఈర్ష లేకుండా ఎంతో ఆప్యాయంగా బావా బావా అంటూ పిలుచుకోవడంతో ఇద్దరు హీరోల అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా మంచి స్నేహితులనే విషయం మనకు తెలిసిందే. ఇక ప్రస్తుతం ఇద్దరు హీరోలు తమ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
Wishing you a Very Happy Birthday Bava @alluarjun. Have a great one !!
— Jr NTR (@tarak9999) April 8, 2023
































