Balakrishna : నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగా డే పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు యోగాసనాలు వేసి యోగా ప్రాముఖ్యతను తెలిపారు. ప్రతి సంవత్సరం జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరపడం మోడీ హయాంలోనే మొదలయింది. యోగా డే వల్ల ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాముఖ్యత మన ఋషులు అందించిన గొప్ప జ్ఞానం ప్రపంచానికి పరిచయమైంది.
యోగాసనాలతో బాలయ్య బాబు…
బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యే గా ప్రతి సంవత్సరం యోగా దినోత్సవం జరుపుతారు. ఈసారి ఆయన మానస పుత్రిక అయిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో యోగా డే సెలెబ్రేషన్స్ చేసారు. ఇక ఆయన యోగాసనాలు వేసి సెలెబ్రేషన్స్ లో పాలుపంచుకున్నారు. యోగా ప్రాముఖ్యతను వివరించారు. యోగాభ్యాసం మనిషి యొక్క మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దృఢం చేయడానికి సహాయపడుతుందని అన్నారు. యోగాను ప్రతిరోజు తప్పకుండా అభ్యాసం చేయాలని రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచం మొత్తం యోగాను అంగీకరించడం, అభ్యసించడం మన సంస్కృతికి దక్కిన గౌరవం అని బాలకృష్ణ అన్నారు. 15 దేశాలతో మొదలైన యోగా ప్రస్తుతం 175 దేశాలకు యోగా చేరిందని అన్నారు .
మన రుషులు, యోగా గురువుల గొప్పతనం ప్రపంచం మొత్తం అంగీకరించారని, గౌరవాన్ని ఇచ్చారని తెలిపారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యోగాకు ప్రాముఖ్యతను ఇస్తున్నాయని అన్నారు. పరబ్రహ్మ స్వరూపమైన ఓంకారం ఎంతో ఉపయోగకరమని, ప్రజలు లక్ష్య సిద్ధి మార్గాన్ని అనుసరించాలని అన్నారు. ఇక అందరికి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బాలకృష్ణ యోగాసనాలు వేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక యోగా డే నాడు ప్రధాని మాది కూడా యోగాసనాలు వేసి ధ్యానం చేయడం వల్ల తనువు, మనసు రెండు ఉత్తేజితం అవుతాయాని తెలిపారు. శాంతికి, సంతోషానికి, ఆరోగ్యానికి యోగా సూచిక అని వివరించారు. ప్రధాన మంత్రి అలాగే ప్రజలందరికి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…