Balakrishna: నందమూరి వారసుడు తారకరత్న అనారోగ్య సమస్యలతో గత 23 రోజులుగా పోరాడుతూ చివరికి మృత్యు కౌగిలిలో బందీ అయ్యారు. తారకరత్న అతి చిన్న వయసులోనే మరణించడంతో ఆయన భార్య అలేఖ్య రెడ్డి తన ముగ్గురు పిల్లలు దిక్కుతోచని స్థితిలో అమాయకంగా తన తండ్రి వైపు చూస్తూ ఉన్నటువంటి సంఘటనలు అందరికీ కన్నీరు పెట్టిస్తున్నాయి.
ఇలా తారకరత్న గుండెపోటుకి గురై ఆస్పత్రిలో చేరిన క్షణం నుంచి ఆయనని ఎలాగైనా ప్రాణాలతో దక్కించుకోవాలని నందమూరి నటసింహం బాలకృష్ణ పడిన తపన ఆరాటం చూస్తుంటే వీరిద్దరికీ ఎంతో మంచి అనుబంధంగా ఉందని తెలుస్తోంది. ఈ విధంగా తారకరత్న కోసం ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించిన బాలయ్య తనని ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నాలు చేశారు.
ఇలా తారకరత్న ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఈయన బెంగుళూరులోనే మకాం మారుస్తూ నిత్యం డాక్టర్లతో మాట్లాడుతూ అతనికి ఎంతో మెరుగైన వైద్య చికిత్సలు చేయించారు. ఇలా ఎన్ని చేసినప్పటికీ విధి చేతిలో తారకరత్న ఓడిపోవాల్సి వచ్చింది. ఇక తారకరత్న మరణించడంతో తన పిల్లల బాధ్యతలను తానే చూసుకుంటానని బాలకృష్ణ హామీ ఇచ్చారు.
ఇక తారకరత్నతో బాలయ్యకు ఎంతో మంచి అనుబంధం ఉందనే విషయం మనకు తెలుస్తుంది. గతంలో బాలకృష్ణ తారకరత్న ఎంతో ఆప్యాయంగా చనువుగా ఉన్నటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో వీరి మధ్య ఎంతో మంచి రిలేషన్ ఉందని తెలుస్తోంది. ఇలా బాలయ్యకు తారకరత్నకు మధ్య ఉన్న అనుబంధంతోనే తనని ఎలాగైనా బ్రతికించుకోవాలని బాలయ్య ఆరాటపడ్డారు.ఇక బాలయ్యకు తారకరత్న పిల్లలతో కూడా ఎంతో మంచి అనుబంధం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తారకరత్న పిల్లలతో బాలయ్య కలిసి దిగిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…