Pruthvi Raj: తెలుగు సినిమా ఇండస్ట్రీలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగుతో ఎంతో ఫేమస్ అయినటువంటి కమెడియన్ పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈయన సోమవారం ఉదయం వీఐపీ దర్శనంలో భాగంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన పృథ్విరాజ్ పవన్ కళ్యాణ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు కెసిఆర్ కోట్ల రూపాయల డబ్బులు పంపించారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలలో ఏమాత్రం నిజం లేదని ఇదంతా కూడా అవాస్తవం అంటూ కొట్టి పారేశారు. పవన్ కళ్యాణ్ కు డబ్బులు పంపించడానికి కేసీఆర్ గారికి డబ్బులు ఊరికే రాలేదు ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అంటూ ఆయన ఖండించారు.
ఒకప్పుడు నాకి కూడా 200 కోట్లు పంపించారని ప్రచారం చేశారు. అయితే ఆ డబ్బును లెక్క పెట్టుకొని ఇంత సమయానికి పూర్తి కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చానని నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది అంటూ ఈ సందర్భంగా తమ గురించి వస్తున్నటువంటి వార్తలను ఖండించారు. ఇక పవన్ కళ్యాణ్ ట్యాక్స్ కట్టుకోవడానికి అప్పు చేశారని ఈయన గుర్తు చేశారు.
ఇక పవన్ కువ్యతిరేకంగా ఆలీ పోటీ చేయబోతున్నారంటూ వచ్చే వార్తలపై కూడా ఈయన స్పందించారు. గత కొద్దిరోజుల క్రితం ఓ వ్యక్తి పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగి పవన్ కళ్యాణ్ తనతో ఫోటో దిగినారని చెప్పుకుంటున్నట్లు ఉంది అలీ పవన్ తో పోటీ చేస్తానని చెప్పడం …. స్థాయి చూసుకోవాలి కదా మనం అంటూ ఈయన అలీ గురించి కామెంట్స్ చేశారు ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…