Tarakaratna: నందమూరి వారసుడు నందమూరి తారకరత్న అతి చిన్న వయసులోనే గుండెపోటుకు గురై మరణించిన విషయం మనకు తెలిసిందే. 39 సంవత్సరాల వయసులోనే తారకరత్న గుండెపోటుకు గురై ఫిబ్రవరి 18వ తేదీ మరణించారు. ఇలా చిన్న వయసులోనే గుండెపోటుకు గురై తారకరత్న మరణించడానికి గల కారణం ఏంటి అని అందరూ ఆరా తీస్తున్నారు.
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఈ ఉరుకుల పరుగుల జీవితంతో పాటు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలోనే అధిక ఒత్తిడికి గురవుతూ రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడుతున్నారు. ఇలా తమపై అధిక ఒత్తిడి పడుతుండడం వల్ల చాలామంది చిన్న వయసులోనే గుండెపోటుకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే తారకరత్న సైతం ఇలాంటి ఒత్తిడికి గురయ్యారని తన సన్నిహితులు తెలియచేస్తున్నారు.
తారకరత్న హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే ఈయన మాత్రం ఇండస్ట్రీలో సక్సెస్ సాధించలేకపోయారు. ఇలా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించలేనని బాధ ఒత్తిడి ఈయనలో అధికంగా ఉంది అయితే ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయినా కనీసం రాజకీయాలలో అయినా రాణించాలని తారకరత్న భావించారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఈయన పోటీ చేయడం కోసం పెద్ద ఎత్తున పార్టీ ప్రచార కార్యక్రమాలలో పాల్గొనారు. ఈ క్రమంలోనే లోకేష్ నిర్వహిస్తున్నటువంటి యువగలం పాదయాత్రలో భాగంగా ఆయనకు మద్దతు తెలుపుతూ ఈయన పాల్గొన్నారు. తారకరత్నకు గుండెపోటు వచ్చిందని ఈ గుండెపోటు కారణంగానే ఆయన మరణించారని సన్నిహితులు భావిస్తున్నారు. ఏది ఏమైనా తారకరత్న మరణ వార్త ఇటు చిత్ర పరిశ్రమకు నందమూరి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులకు తీరని లోటు అని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…