Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. అఖండ వంటి బ్లాక్ బస్టర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణ జనవరి 12వ తేదీ వీరసింహారెడ్డి సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ శృతిహాసన్ జంటగా నటించిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా బాలకృష్ణ ఎంతో సాంప్రదాయ బద్ధంగా ధోతి గోల్డ్ కలర్ బ్లేజర్ ధరించి ఈ కార్యక్రమానికి హాజరవడంతో అందరి దృష్టి ఈయన డ్రెస్ పై పడింది. అదేవిధంగా బాలకృష్ణ ధరించిన వాచ్ కూడా అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ క్రమంలోనే బాలయ్య ధరించిన ఈ వాచ్ ఖరీదు ఎంత అనే విషయం గురించి అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే బాలకృష్ణ ఈ సినిమా వేడుకలో ధరించిన వాచ్ కార్టియర్ కి చెందినది ఈ వాచ్ ధర అక్షరాల రూ.24,58,987 అని ఉండడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
బాలకృష్ణ ధరించిన వాచ్ ఖరీదు అన్ని లక్షల అని ఆశ్చర్యపోతున్నారు. అయితే కార్టియర్ సాంటోస్ 100 స్కెలెటన్ పేరుతో ఉన్న ఈ వాచ్ ను బాలకృష్ణకు తన పెద్ద కుమార్తె బ్రాహ్మిని గిఫ్ట్ గా ఇచ్చారని తెలుస్తోంది. ఇలా బాలయ్య వాచ్ ధర తెలిసి అభిమానులతో పాటు నేటిజన్ లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి కొన్ని గంటలలో వీర సింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…