Featured

Balakrishna : శ్రీదేవితో కాదు..బాలయ్య ఈ హీరోయిన్ తో కూడా జోడి కట్టలేకపోయారని తెలుసా.?!

Balakrishna : 1980’s అందాల నటి శ్రీదేవి ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబులతో అనేక విజయవంతమైన చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. అప్పటి స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. వీరిలో ఒక్క బాలకృష్ణ మాత్రమే శ్రీదేవితో జోడి కట్టలేకపోయారు. ఆ తరువాత 1980’s చివర.. 1990’s ప్రారంభంలో వచ్చిన ఓ అందాల తారతో స్టార్ హీరోలైన చిరంజీవి నాగార్జున వెంకటేష్ జతకట్టారు. కానీ బాలయ్య ఆ హీరోయిన్ తో స్టెప్పులు వేయలేకపోయారు.

చెన్నైలో ప్రముఖ నాట్యకారిణి రుక్మిణీదేవి అరండేల్ వద్ద శాస్త్రీయ నృత్య శిక్షణ పొందుతున్న అమల తమిళ దర్శకుడు భారతీరాజా దృష్టిలో పడి ఆయన దర్శకత్వం వహించిన వైశాలి అనే తమిళ చిత్రం ద్వారా కథానాయికగా సినీరంగంలోనికి ప్రవేశించింది. తెలుగులో ఈమె మొదటి చిత్రం డి.రామానాయుడు నిర్మించిన చినబాబు చిత్రం ఇందులో కథానాయకుడు నాగార్జున. నాగార్జునతో ఆ చిత్ర నిర్మాణ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వారిరువురూ 11 జూన్ 1992న వివాహబంధం ద్వారా ఒక్కటయ్యేలా చేసింది. ఆ నలుగురు స్టార్ హీరోల్లో అమల మొదటగా నాగార్జునతో నటించింది.

“చినబాబు” 1988, మే 6న విడుదలైన తెలుగు చలనచిత్రం. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. రామానాయిడు నిర్మాణ సారథ్యంలో ఎ. మోహన్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, అమల అక్కినేని, రావు గోపాలరావు, మోహన్ బాబు, మాగంటి మురళీమోహన్ ప్రధాన పాత్రలలో నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.ఈ చిత్రం పసతై పేరుతో తమిళంలోకి అనువాదమయింది. ఈ సినిమా అనంతరం అమల మెగాస్టార్ చిరంజీవితో జత కట్టారు.

“రాజా విక్రమార్క” రవిరాజాపినిశెట్టి దర్శకత్వం వహించిన 1990 భారతీయ తెలుగు భాషా చిత్రం మరియు చిరంజీవి, రాధిక మరియు అమల నటించారు. ఈ చిత్రం 1988లో వచ్చిన అమెరికన్ చిత్రం కమింగ్ టు అమెరికా ఇది తమిళంలో సత్యమా నాన్ కావల్కరన్ మరియుహిందీలో దౌలత్ కి దునియాగా డబ్ చేయబడింది. ఆ తర్వాత అమల విక్టరీ వెంకటేష్ తో జోడీ కట్టారు.

“అగ్గిరాముడు” 1990లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ రాఘవేంద్ర ఆర్ట్స్ పిక్చర్స్ పతాకంపై ఎం.కృష్ణ, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మించగా, ఎస్.ఎస్.రవిచంద్ర దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో దగ్గుబాటి వెంకటేష్ ద్విపాత్రినయం చేసాడు. గౌతమి, అమల ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించాడు. 1980,1990’s నాటి స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలలో అమల బాలయ్యతో హీరోయిన్ గా చేయలేకపోయారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago