Madhu Shalini : తెలుగమ్మాయి మధు షాలిని ముందు యాంకర్ గా తన కెరీర్ మొదలుపెట్టి ఆ తరువాత మిస్ ఆంధ్రప్రదేశ్ గా గెలిచి సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన కితకితలు సినిమాతో మంచి హిట్ కొట్టింది. హైదరాబాద్ కు చెందిన మధుషాలిని కూచిపూడి డాన్సర్ కూడా. కితకితలు సినిమా తరువాత తేజ దర్శకత్వంలో ఆది పినిశెట్టి హీరోగా ఒక వి చిత్రం సినిమాలో నటించింది. ఇక అటు తమిళ సినిమాలతోను బిజీ అయిన మధు షాలిని తాజాగా పెళ్లి చేసుకుని అందరికి షాకిచ్చింది.
సీక్రెట్ గా తమిళ హీరోతో వివాహం…
తమిళ్ లో విశాల్, ఆర్య నటించిన అవన్ ఇవన్ సినిమాలో నటించింది. చాలానే తమిళ సినిమాల్లో చేసినా ఈ అమ్మడు తెలుగులో మాత్రం పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. గూడచారి, వంటి సినిమాల్లో కనిపించినా పెద్దగా కెరీర్ కి పనికిరాలేదు. ఇక ఇపుడు తమిళ హీరోని సీక్రెట్ గా పెళ్లి చేసుకుని అందరికి షాకిచ్చింది మధు. హైదరాబాద్ లో జూన్ 16 న వీరి వివాహం జరిగింది.
గోకుల్ ఆనంద్ తో మూడుముళ్ల బంధం లోకి అడుగుపెట్టింది. వీరిద్దరూ కలిసి తమిళంలో పంచాక్షరం అనే సినిమాలో నటించారు. ఆ సినిమాలో మొదలైన పరిచయం స్నేహంగా మారి ఆపై ప్రేమ చిగురించి పెళ్లిపీటలు ఎక్కారు. తాజాగా మధుషాలిని 9 హవర్స్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఇక గోకుల్ ఆనంద్ కూడా అటు తమిళ సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నాడు. సోషల్ మీడియా ద్వారా తమ పెళ్లి గురించి అభిమానులతో పంచుకున్న మధు షాలినికి అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…