Categories: FeaturedMovie News

Balakrishna &Vijayashanthi : బాలయ్య, జయమ్మ పెయిర్ కి ఎందుకంత క్రేజ్… ఎన్ని హిట్ సినిమాలోన్నాయో తెలుసా…!

Balakrishna & Vijayashanthi : ఇండస్ట్రీ హీరో హీరోయిన్లను రిపీట్ చేయడం కామన్. ఇప్పుడైతే ఒక సినిమా తరువాత మరో సినిమాకు అదే హీరోయిన్ ను పెట్టుకోవడం చాలా తక్కువ. ఒక మూడో నాలుగో అంతకుమించి హిట్ పెయిర్ కాంబినేషన్లు పడవు. కానీ చిరు, బాలయ్య, వెంకీ, నాగ్ హీరోలుగా ఉన్న సమయంలో అలా కాదు హిట్లు వచ్చిన హీరోయిన్, కెమిస్ట్రీ కుదిరిన హీరోయిన్ తో ఎక్కువ సినిమాలను తీయడానికి దర్శకానిర్మాతలు ఇంట్రస్ట్ పెట్టేవారు. అప్పట్లో హిట్ పెయిర్ అంటే బాలయ్య-విజయశాంతి, చిరు-రాధా టక్కున గుర్తొస్తారు. అప్పట్లో వీళ్ళ కాంబినేషన్ లో డజనుకు పైనే సినిమాలు ఉన్నాయి. ఇక చిరు విజయశాంతి కాంబినేషన్ కూడా హిట్ పెయిర్ అవ్వడం విశేషం.

బాలయ్య, జయమ్మ క్రేజీ కాంబో…

హిట్ పెయిర్స్ లో క్రేజీ కాంబో అంటే మాత్రం బాలయ్య, జయమ్మ కాంబినేషన్. వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ దాదాపుగా హిట్లు, యావరేజ్ లుగా మిగిలాయి. ఒక సినిమా మాత్రమే డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఏ సినిమాలు సూపర్ హిట్లు, యావరేజ్ లు అయ్యాయంటే… వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ‘కథనాయకుడు’. 1984 లో వచ్చిన ఈ సినిమాకు దర్శకులు మురళి మొహన్ రావు గారు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక వెంటనే మళ్ళీ వీరి కాంబో లో వచ్చిన సినిమా ‘పట్టాభిషేకం’ ఈ సినిమాను రాఘవేంద్రరావు దర్శకత్వం చేసారు ఇక ఈ సినిమా యావరేజ్ హిట్ గా నిలిచింది.

ఒకే ఏడాది మూడు సినిమాలు…

ఇక 1986 సంవత్సరం లో వీరిద్దరి కాంబినేషన్ లో ఏకంగా మూడు సినిమాలు వచ్చాయి. ఇందులో మొదటిది ‘ముద్దుల కృష్ణయ్య’ కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తరువాత ఎస్. ఎస్. రవిచంద్ర దర్శకత్వంలో వచ్చిన ‘దేశోద్దరకుడు’ సినిమా కూడా హిట్ అయింది. ఇక అదే ఏడాది వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ‘అపూర్వ సహోదరులు’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మళ్ళీ 1987 లో ఈసారి నాలుగు సినిమాల్లో కలిసి నటించయు బాలయ్య జయమ్మ. వాటిలో మొదటిది ‘భార్గవ రాముడు’ కోదండ రామిరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఇక వెంటనే మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ఏడో సినిమా ‘సాహస సామ్రాట్’ ఈ సినిమా టైటిల్ విషయంలో అప్పట్లో కాంట్రావెర్సీ అయినా సినిమా పెద్దగా ఆడలేదు. ఈ ఏడో సినిమా డిజాస్టర్ గా మిగిలింది, రాఘవేంద్రరావు ఈ సినిమాకు డైరెక్టర్.

ఆ తరువాత కోదండ రామిరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘భానుమతి గారి మొగుడు’ ఇది యావరేజ్ గా నిలిచింది. అయితే నెక్స్ట్ వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ‘మువ్వగోపాలుడు’ సూపర్ హిట్ అయింది. కోడి రామకృష్ణ ఈ సినిమాకు డైరెక్టర్. ఇక ఆ తరువాత ఏడాది వచ్చిన ‘ఇన్స్పెక్టర్ ప్రతాప్’ ‘భలేదొంగ’ సినిమాలు యావరేజ్ గా నిలిచాయి. ఇక ఇక వీరి కాంబినేషన్ లో వచ్చిన సుపర్ హిట్ సినిమా ‘ముద్దులమావయ్య’ ఆ సినిమా తరువాత ‘ముద్దుల మేనల్లుడు’ గా కోడి రామకృష్ణ తో మరో సారి హిట్ కొట్టారు ఈ జంట. ఇక బి గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన ‘లారీ డ్రైవర్’ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తరువాత ‘తల్లిదండ్రులు’ సినిమా హిట్ గా నిలిచింది. ఇక మళ్ళీ వీరి కాంబినేషన్ లో ‘రౌడీ ఇన్స్పెక్టర్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక వీరి కాంబినేషన్ లో చివరగా వచ్చిన సినిమా ‘నిప్పురవ్వ’, ఈ సినిమా బాగా ఆడినా ఓవర్ బడ్జెట్ వల్ల కలెక్షన్స్ రాబట్టుకోలేదు. అలా బాలయ్య, జయమ్మ కాంబినేషన్ లో 17 సినిమాలకు గాను ఒకటే డిజాస్టర్ ఉండటం విశేషం.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago