Prashanthi : ఈ సోషల్ మీడియా జనాలకు బాగా అలవాటు అయిపోయాక తమకు ఇష్టమైన సెలబ్రిటీస్ గురించి మరింత తెలుసుకోవాలనే ఉత్సాహం ఎక్కువైంది. ఇక సెలబ్రిటీలు కూడా చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ యూట్యూబ్ ఛానెల్స్ పెట్టుకుని వారి అభిమానులకు మరింత దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. ఇక బుల్లితెర నటులనైతే చెప్పక్కర్లేదు, వాళ్ళ షూటింగ్ వ్లాగ్స్ తో మొదలు వాళ్ళ మేకవ్ లు జ్యువలరీ అంటూ ఎన్ని చూపిస్తున్నారు. ఇక ఈ మధ్య ప్రతి సెలబ్రిటీ వాళ్ళ ఇంటిని హోమ్ టూర్ వీడియో అంటూ చేయడం కామన్ అయిపోయింది. ప్రేక్షకులు కూడా సెలబ్రిటీలు ఎలా ఉంటారో చూడాలనే ఉత్సాహం తో ఇలాంటి వీడియోలను ఎక్కువగా చూస్తుంటారు. ఇక హోమ్ టూర్ వ్లాగ్ బ్యాచ్ లోకి మరో సీరియల్ నటి ప్రశాంతి కూడా వచ్చింది.
మరో ఇల్లు కొనుక్కున్న ప్రశాంతి…
యాంకర్ గా కెరీర్ స్టార్టు చేసి అప్పట్లో మంచి క్రేజ్ తో దూసుకుపోయిన ప్రశాంతి, ఆ తరువాత సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ‘ఎఫైర్’ అనే సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా అది ఏమాత్రం తన కెరీర్ కి ప్లస్ అవ్వలేదు. ఇక సినిమాల్లోకి వెళ్లడం కోసం యాంకరింగ్ వదులుకోవడంతో అటు సినిమాలు పోయి, ఇటు యాంకరింగ్ పోయి ప్రశాంతి బ్బందులు పడింది. ఇక మళ్ళీ రీ ఎంట్రీ సీరియల్స్ లోకి ఇచ్చింది. మా టీవీ లో ప్రసారమయ్యే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో లాస్య పాత్రలో విలన్ గా చాలా చక్కగా నటిస్తూ పేరు తెచ్చుకుంది మరో సారి. ఇక గృహలక్ష్మి సీరియల్ లో మెయిన్ హైలైట్ లాస్య క్యారెక్టర్ అనేంతలా మారిపోయింది. ఇక జీ తెలుగులో దేవతలారా దీవించండి సీరియల్ లో కూడా విలన్ క్యారెక్టర్ చేస్తోంది ప్రశాంతి.
ఇక ప్రేక్షకులకు మరింత చేరువయ్యేందుకు యూట్యూబ్ లో ప్రశాంతి వైబ్స్ అనే ఛానెల్ పెట్టి అందులో తనకు సంబంధించిన విశేషాలను ఫ్యాన్స్ తో పంచుకుంటోంది. అలానే తాజాగా హోమ్ టూర్ వీడియో చేసింది ప్రశాంతి. మరో ఇల్లు కొన్నాను అంటూ వీడియో పెట్టిన ప్రశాంతి తనకు ఆస్తులంటే చాలా ఇష్టమని అందుకే పెట్టుబడి పెడుతుంటానని చెప్పింది. ఇక తనకు బంగారం అన్నా చాలా ఇష్టం అందుకే బంగారం కూడా ఎక్కువగా కొంటానని చెప్తోంది ప్రశాంతి. ఇంటిని వైట్ అండ్ గ్రే కాంబినేషన్ లో కప్ బోర్డు దగ్గరం మాత్రం వుడ్ కలర్ కాంబినేషన్ తో విశాలవంతమైన ఇంటిని ప్లాన్ చేసారు ప్రశాంతి. గాలి వెలుతురు బాగా ఉండటం తనకు ఇష్టమట అందుకే బాగా వెలుతురు వచ్చే ఇంటిని కొనుగోలు చేసింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…