Categories: FeaturedMovie News

Thammareddy Bhardwaja : కొనుక్కునే అవార్డులు నీకుందుకు ? జయసుధకు పద్మశ్రీ రాకపోవడంపై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్..

Thammareddy Bhardwaja : సీనియర్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ అయిన తమ్మారెడ్డి భారద్వాజ సినిమాలకు దూరంగా ఈ మధ్య ఉంటూ కేవలం సినిమా వాళ్లకు సంబంధించిన ఇష్యూల్లో స్పందిస్తూ అడపాదడపా మీడియాలో కనిపిస్తున్నారు. ఇక తాజాగా యూట్యూబ్ కి ఇంటర్వ్యూ ఇస్తూ సినిమా రంగంలోని ప్రస్తుత విషయాల గురించి ఆయన ఒపీనియన్ చెబుతూ ఉంటారు. అలానే ఇటీవల జయసుధ చేసిన కామెంట్స్ పై స్పందించారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో పాల్గొన్న జయసుధ ఇండస్ట్రీ లో హీరోల డామినేషన్, మా అసోసియేషన్ బిల్డింగ్ మీద ఇక అవార్డుల విషయంలోను చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి.

కొనుక్కునే అవార్డులు నీకెందుకు…

జయసుధ యాభై ఏళ్ల తన సినిమా ప్రయాణం గురించి మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డుల వంటి వాటికి మేము పనికిరామా అంటూ కామెంట్స్ చేసారు. ఇక ఈ విషయం పై తమ్మారెడ్డి స్పందిస్తూ కొనుక్కునే అవార్డులు నీకెందుకు ప్రజలు నీకు యాభై ఏళ్లుగా నీరాజనాలు పలికారు కదా. విలువలేని ఆ అవార్డులు ఎందుకు అంటూ కామెంట్ చేసారు. గత ముప్పై ఏళ్లుగా ఈ అవార్డులను కొనుక్కుంటున్నారు ప్రతిభ ఆధారంగా ఏం రావడం లేదు, రాజకీయ లాభం కోసం పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డులను ఇస్తున్నారు. ఇప్పుడు ఇస్తున్న భారతరత్న తో సహా ఏ అవార్డుకు విలువ లేకుండా చేసారు. అర్హత లేనివాళ్లకు ఆ అవార్డులు ఇస్తున్నారు. అలాంటి వాటి కోసం నువ్వు ఆరాట పడటం ఏంటి అంటూ జయసుధ ని ఉద్దేశించి మాట్లాడారు. ఇక మా అసోసియేషన్ బిల్డింగ్ గురించి జయసుధ ఇన్నేళ్లలో కట్టలేదు ఇకపై కడతారో లేదో అంటూ కామెంట్స్ చేసిన దానిపై స్పందించారు. మా బిల్డింగ్ కట్టకపోతే ఇప్పుడు వచ్చిన నష్టమేంటి ఆ డబ్బులని వాళ్ళు తింటే అడగాలి కానీ ఆ బిల్డింగ్ కోసం పెట్టిన డబ్బు అలానే ఉంది కదా, ఖర్చు చేయలేదు. ఇక ఆ భవనం కడితే ఎవరికి లాభం ప్రెసిడెంట్, మెంబెర్స్ ఏసీ గాధుల్లో కూర్చుంటారు.

అదే ఆ డబ్బు ఖర్చు పెట్టకుండా అలానే పెడితే ఇంకేదైనా పనికి ఉపయోగించవచ్చు కదా అంటూ మాట్లాడారు. ఇక ఒక హీరో యాభై ఏళ్ల ఇండస్ట్రీ జర్నీ సెలెబ్రేషన్స్ అయితే బాగా జరుగుండేవి నాకు కనీసం ఎవరు అభినందనలు చెప్పలేదని జయసుధ అన్న మాటలకు తమ్మారెడ్డి స్పందిస్తూ ఇప్పుడు యాక్టీవ్ గా సినిమాల్లో ఉండుంటే వేడుక జరిగేదేమో కానీ ఈ మధ్య ఆవిడ సినిమాలను ఎక్కువగా చేయడం లేదు కదా. అయినా ఏదో టాప్ హీరో చిరు లాంటి వాళ్ళైతే ఇంటికి వెళ్లి అభినందనలు ఉంటాయి కానీ మిగిలిన సీనియర్ హీరోలు కానీ ఎవరికీ అలాంటివి జరగవు. ఒకరితో ఉపయోగం అంటేనే ఎవరైనా గుర్తుంచుకుంటారు, మాట్లాడుతారు లేదంటే పట్టించుకోరు అంటూ జయసుధ మాటలపై స్పందించారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago