Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ కేవలం హీరోగా మాత్రమే కాకుండా, వ్యాఖ్యాతగా కూడా తన మార్క్ ఏంటో చూపించారు. ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ఈయన వ్యాఖ్యతగా వ్యవహరిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇప్పటికే మొదటి సీజన్ సక్సెస్ ఫుల్ కావడంతో రెండవ సీజన్ కూడా ప్రారంభించారు.
మొదటి సీజన్ సినీ సెలబ్రిటీలను గెస్ట్లుగా ఆహ్వానించి బాలకృష్ణ తనదైన శైలిలో ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టారు. అయితే రెండవ సీజన్లో మాత్రం ఎంతో విభిన్నంగా రాజకీయ నాయకులను కూడా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం పై అంచనాలు పెంచారు.ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అయితే నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హాజరు కానున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఎంపీ సురేష్ నటి రాధిక కూడా హాజరు కానున్నారు.కిరణ్ కుమార్ రెడ్డి కేవలం మాజీ ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా చిన్నప్పటి నుంచి బాలకృష్ణకు ఆప్తమిత్రుడు కావడంతో ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. తాజాగా విడుదలైన ప్రోమోలో భాగంగా బాలకృష్ణ కిరణ్ కుమార్ రెడ్డిని ఎన్నో విషయాలు ప్రశ్నించడమే కాకుండా దివంగత నాయకుడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. మనం గొప్ప వ్యక్తులను నాయకులను కోల్పోయాము. అలాంటి గొప్ప వ్యక్తులలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒకరు అంటూ బాలకృష్ణ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.ఇలా బాలకృష్ణ హీరోగా మాత్రమే కాకుండా టిడిపి ఎమ్మెల్యేగా కొనసాగుతూ వైఎస్సార్ గురించి గొప్పగా చెప్పడంతో వైయస్సార్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ కిరణ్ కుమార్ రెడ్డి మధ్య ఎలాంటి విషయాలు ప్రస్తావనకు వస్తాయి అనే విషయంపై ఆసక్తి ఏర్పడింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…