Movie News

Director Teja: ఉదయ్ కిరణ్ మరణించడానికి కారణాలు నాకు తెలుసు… నేను చనిపోయేలోపు అన్నీ బయటపెడతా.. డైరెక్టర్ తేజ సంచలన వ్యాఖ్యలు !!

Director Teja: తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ తేజ ఎంతోమంది యంగ్ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇలా ఈయన హీరోగా పరిచయం చేసిన వారిలో దివంగత నటుడు ఉదయ్ కిరణ్ ఒకరు. ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీకి చిత్రం సినిమా ద్వారా పరిచయం చేశారు.

ఇలా మొదటి సినిమా మంచి విజయం అందుకోవడంతో వీరిద్దరి కాంబినేషన్లో నువ్వు నేను మరో బ్లాక్ బస్టర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇలా ఉదయ్ కిరణ్ డైరెక్టర్ తేజకు మధ్య ఎంతో మంచి అనుబంధం ఏర్పడింది.అయితే ఉదయ్ కిరణ్ ఊహించిన విధంగా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఓ వెలుగు వెలిగి చివరికి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు.

క్రమక్రమంగా ఈయన నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడం అవకాశాలు లేక ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో తన సొంత ఫ్లాట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఇప్పటివరకు ఉదయ్ కిరణ్ మరణానికి గల కారణం కేవలం అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులే అనే విషయం వార్తల్లో ఉంది.అయితే తాజాగా డైరెక్టర్ తేజ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఉదయ్ కిరణ్ మరణం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Director Teja: చనిపోయేలోపు అన్ని బయట పెడతా….

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి డైరెక్టర్ తేజ ఉదయ్ కిరణ్ మరణించడానికి గల కారణాలు నాకు తెలుసు ఆయన చనిపోయే ముందు రోజు నాకు ఫోన్ చేసి ఎన్నో విషయాలను తెలిపారు. అయితే వాటిని నేను ఇప్పుడు చెప్పను కానీ నేను చనిపోయే లోపు ఏదో ఒక రోజు వాటన్నింటిని బయటపెట్టి చనిపోతానని ఈయన షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇలా ఉదయ్ కిరణ్ మరణం గురించి తేజ చెప్పడంతో అసలు ఉదయ్ కిరణ్ మరణానికి కారణాలు ఏమై ఉండవచ్చు అంటూ తేజ వ్యాఖ్యలు చర్చలకు దారి తీసాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago