Ramesh Babu: ఘట్టమనేని కుటుంబానికి ఏడాది పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. ఈ ఏడాది మొదట్లోనే కృష్ణ మొదటి కుమారుడు రమేష్ బాబు కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మృతి చెందారు. అదేవిధంగా సెప్టెంబర్ నెలలో కృష్ణ తల్లి ఇందిరాదేవి, మూడు రోజుల క్రితం నటుడు కృష్ణ మరణించారు. ఈ విధంగా ఒకే ఏడాదిలోనే మహేష్ బాబు తన తల్లిదండ్రిని తన సోదరుడిని కోల్పోవడం ఎంతో విషాదం.
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అన్నయ్యతో పాటు తల్లిదండ్రులు కూడా దూరం కావడంతో మహేష్ బాబు ఒంటరయ్యారనీ ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిజానికి కృష్ణ ఇందిరాదేవి రమేష్ బాబు మరణంతో మహేష్ బాబు ఒంటరి కాలేదు రమేష్ బాబు భార్య మృదుల ఒంటరి అయ్యారు.
కృష్ణ వారసుడిగా బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రమేష్ బాబు సామ్రాట్ సిమాతో హీరోగా మారారు. ఈ విధంగా హీరోగా పలు సినిమాలలో నటించిన ఈయన పెద్దలు నిశ్చయించిన వివాహం చేసుకున్నారు. ఇలా మృదలను వివాహం చేసుకున్న రమేష్ బాబు దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అమ్మాయి భారతి అబ్బాయి జయకృష్ణ అనే ఇద్దరు సంతానం కలరు.
ఈ విధంగా కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి రమేష్ బాబు ఈ ఏడాది మొదట్లో కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మరణించారు. తన భర్త దూరమైన అత్తమామలు తనకు అండగా ఉన్నారని ఎంతో ధైర్యంగా ఉన్నటువంటి మృదులకు ఈ ఏడాదిలోనే తన అత్తమామలు కూడా మరణించడంతో మృదుల ఒంటరి అయిందనీ, ఆమెకు మహేష్ బాబు ఫ్యామిలీ అండదండలు కూడా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…