Categories: FeaturedMovie News

GV Narayana : హీరో విజయ్ నాన్న డైరెక్ట్ చేసిన సినిమా.. చిరు-విజయశాంతిల మొదటి సినిమా.. కన్నడంలో ఫెయిలై తెలుగులో హిట్ అయిన సినిమా.!!

GV Narayana : 1980’s నాటి దర్శకుడు ఎస్ ఏ చంద్రశేఖర్ తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో 70కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు. నిర్మాతగా ఏడు చలన చిత్రాలను నిర్మించాడు. 17 తమిళ సినిమాలకు కథను అందించాడు. 44 సినిమాలకు స్క్రీన్‌ప్లే వ్రాశాడు. అంతే కాక 15 సినిమాలలో నటించాడు కూడా. ఇతడు తెలుగులో చిరంజీవితో మొదటిసారిగా “చట్టానికి కళ్లులేవు” చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రముఖ నటుడు జీవి నారాయణరావు నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు సినిమాలకు సుపరిచితుడు. ఆయన నటిస్తూ.. సినిమాలను కూడా నిర్మించాలనుకున్నారు.

ఆ క్రమంలో చిరంజీవితో సినిమా చేయాలనుకుని ఆయనను సంప్రదించారు. తన మనసులో మాట చెప్పగానే చిరంజీవి నారాయణరావుతో సినిమా చేయడానికి ఒప్పుకుని డేట్స్ కూడా ఇచ్చారు. అలా అడగగానే డేట్స్ ఇవ్వడంతో జివి నారాయణరావు ఎంతో సంతోషపడ్డారు. 1981లో విడుదలైన “చట్టానికి కళ్ళులేవు” చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో దర్శకుడు ఎస్ ఏ చంద్రశేఖర్ ని సంప్రదించారు. అయన చిరంజీవితో రెండోసారి సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. మొదటిసారి నిర్మాతగా వ్యవహరించిన జీవి నారాయణరావు సినిమా నిర్మాణానికి కొత్త ఏమీ కాదు. ఇదివరకే నారాయణరావు వాళ్ళ నాన్న నవయుగ సంస్థను స్థాపించి అనేక సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా చేశారు.

ఎన్టీఆర్, ఏఎన్నార్ నటించిన ఎక్కువ చిత్రాలకు ఆయన డిస్ట్రిబ్యూటర్ గా చేశారు. అలా చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలో పెరిగిన జీవి నారాయణరావు చిరంజీవితో నిర్మాతగా మొదటిసారిగా దేవాంతకుడు చిత్రాన్ని నిర్మించారు. ఇకపోతే ఆ సినిమా నిర్మాణానికి ముందు చిరంజీవితో జోడీగా ఎవరిని తీసుకుందామనే క్రమంలో.. సురేష్ ప్రొడక్షన్స్ లో వచ్చిన సంఘర్షణ చిత్రంలో విజయశాంతి రెండో హీరోయిన్ గా నటించారు. ఆ సినిమా తర్వాత చిరంజీవితో సోలో హీరోయిన్ గా నటించిన మొదటి చిత్రం దేవాంతకుడుగా పేర్కొనవచ్చు.

ఈ చిత్రం అప్పటికే కన్నడంలో పరాజయం పొందిన “గెలువు నన్నదే” అనే చిత్రం ఆధారంగా దేవాంతకుడు చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మించారు. కానీ ఈ సినిమా తెలుగులో విజయం సాధించింది. అలా నిర్మాతగా మారిన జీవి నారాయణరావు అనేక సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత చిరంజీవితో నారాయణరావు నిర్మించిన యముడికి మొగుడు చిత్రం 1988లో ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

9 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

10 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

17 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

18 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

18 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

1 day ago