GV Narayana : 1980’s నాటి దర్శకుడు ఎస్ ఏ చంద్రశేఖర్ తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో 70కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు. నిర్మాతగా ఏడు చలన చిత్రాలను నిర్మించాడు. 17 తమిళ సినిమాలకు కథను అందించాడు. 44 సినిమాలకు స్క్రీన్‌ప్లే వ్రాశాడు. అంతే కాక 15 సినిమాలలో నటించాడు కూడా. ఇతడు తెలుగులో చిరంజీవితో మొదటిసారిగా “చట్టానికి కళ్లులేవు” చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రముఖ నటుడు జీవి నారాయణరావు నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు సినిమాలకు సుపరిచితుడు. ఆయన నటిస్తూ.. సినిమాలను కూడా నిర్మించాలనుకున్నారు.

ఆ క్రమంలో చిరంజీవితో సినిమా చేయాలనుకుని ఆయనను సంప్రదించారు. తన మనసులో మాట చెప్పగానే చిరంజీవి నారాయణరావుతో సినిమా చేయడానికి ఒప్పుకుని డేట్స్ కూడా ఇచ్చారు. అలా అడగగానే డేట్స్ ఇవ్వడంతో జివి నారాయణరావు ఎంతో సంతోషపడ్డారు. 1981లో విడుదలైన “చట్టానికి కళ్ళులేవు” చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో దర్శకుడు ఎస్ ఏ చంద్రశేఖర్ ని సంప్రదించారు. అయన చిరంజీవితో రెండోసారి సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. మొదటిసారి నిర్మాతగా వ్యవహరించిన జీవి నారాయణరావు సినిమా నిర్మాణానికి కొత్త ఏమీ కాదు. ఇదివరకే నారాయణరావు వాళ్ళ నాన్న నవయుగ సంస్థను స్థాపించి అనేక సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా చేశారు.

ఎన్టీఆర్, ఏఎన్నార్ నటించిన ఎక్కువ చిత్రాలకు ఆయన డిస్ట్రిబ్యూటర్ గా చేశారు. అలా చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలో పెరిగిన జీవి నారాయణరావు చిరంజీవితో నిర్మాతగా మొదటిసారిగా దేవాంతకుడు చిత్రాన్ని నిర్మించారు. ఇకపోతే ఆ సినిమా నిర్మాణానికి ముందు చిరంజీవితో జోడీగా ఎవరిని తీసుకుందామనే క్రమంలో.. సురేష్ ప్రొడక్షన్స్ లో వచ్చిన సంఘర్షణ చిత్రంలో విజయశాంతి రెండో హీరోయిన్ గా నటించారు. ఆ సినిమా తర్వాత చిరంజీవితో సోలో హీరోయిన్ గా నటించిన మొదటి చిత్రం దేవాంతకుడుగా పేర్కొనవచ్చు.

ఈ చిత్రం అప్పటికే కన్నడంలో పరాజయం పొందిన “గెలువు నన్నదే” అనే చిత్రం ఆధారంగా దేవాంతకుడు చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మించారు. కానీ ఈ సినిమా తెలుగులో విజయం సాధించింది. అలా నిర్మాతగా మారిన జీవి నారాయణరావు అనేక సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత చిరంజీవితో నారాయణరావు నిర్మించిన యముడికి మొగుడు చిత్రం 1988లో ఏకంగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.


































