నందమూరి నటసింహం బాలకృష్ణ ఫుల్ జోష్ లో ఉన్నాడు. బాలయ్య నటించిన ‘ అఖండ’ బిగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన అఖండ.. బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. రికార్డ్ కలెక్షన్లను సాధించింది. కరోనా లాక్ డౌన్ అనంతరం విడుదలైన భారీ చిత్రం కావడంతో.. ప్రేక్షకులు కూడా సినిమాకు బ్రహ్మరథం పట్టారు. బాక్సాఫీస్ వద్ద బాలయ్య విశ్వరూపం చూపించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.
దేశం మొత్తం మీద రూ.150 కోట్లు గ్రాస్ కలెక్షన్లను సాధించి బాలయ్య “అఖండ” అద్బుతమైన రికార్డ్ నమోదు చేసింది. ఇప్పటికీ పలు థియేటర్లో ఇప్పటికీ ఈ సినిమా నడుస్తుంది అంటే అఖండ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఈ క్రమంలో 100 రోజులను పూర్తి చేసుకున్నందుకు గానూ అఖండ ‘కృతజ్ఞత సభ’ ను నిర్వహించారు. కర్నూల్ ఎస్టీబీసీ గ్రౌండ్‌లో జరిగిన ఈ సభ అత్యంత ఘనంగా నిర్వచించారు సినిమా టీమ్.. ఈ నేపధ్యంలో అఖండ సినిమా లో నటిచిన నటీనటులు అందరూ ఒక బస్సులో కర్నూలు వెళ్ళిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో బాలకృష్ణ.. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌ను.. ‘ప్రగ్యా ఇప్పుడే బాగా రెస్ట్ తీసుకో.. మనం ఇప్పుడు ఎక్కడికో తెలుసా? రాయలసీమ. అక్కడ జనం, వారి అభిమాన్ని తట్టుకోలేవ్.. దబిడి దిబిడియే’ అంటూ ఆటపట్టించాడు. ఈ విడియోలో బాలయ్య హీరోయిన్ ను ఆటపట్టించిన తీరును చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…