కరోనా లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన సినిమా షూటింగులని తిరిగి మొదలు పెట్టాలని చిరంజీవి నేతృత్వంలోని పలువురు సినీ ప్రముఖులు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసానితో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిసిన సంగతి తెలిసిందే.. అయితే ఆ మీటింగ్ కి తనని పిలువలేదని, ఇండస్ట్రీ పెద్దలు మంత్రి తలసానితో కలిసి భూములు పంచుకోవడానికి మాత్రమే కలిసారంటూ హీరో బాలకృష్ణ కామెంట్స్ చేయడం పెద్ద సంచలనాన్నే సృష్టించాయి. అయితే తాజాగా ఒక యుట్యుబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యులో ఈ విషయంపై స్పందించారు బాలకృష్ణ. ఈ విషయంలో సిఎం కెసిఆర్ పై వ్యాఖ్యలు చేసారు.
సీఎం కేసీఆర్‌ను కలవడానికి వాళ్ళు నన్ను ఎందుకు పిలవలేదో నాకు తెలియదు. గతంలో నేను రాజకీయ కోణంలో కేసీఆర్‌పై చేసిన విమర్శల వల్లే నన్ను పిల్వకుడదని వాళ్ళు అనుకుని ఉంటె.. ఆ విషయం నాకు చెప్పాల్సింది. నాకు తెలిసి సిఎం కేసీఆర్ గారికి నా మీద ఎప్పుడూ కోపం లేదు. అయినా రాజకీయాలు వేరు. అలా అనుకుంటే నామా నాగేశ్వరరావు ఆయనను ఎన్నో తిట్టు తిట్టారు. ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరలేదా?. నందమూరి రామారావుగారి అభిమానిగా నేనంటే కేసీఆర్ గారికి పుత్ర వాత్సల్యం ఉంది. అందువల్ల అయన అలా మాట్లాడి ఉండరు.. ఇక ఈ విషయంలో మిగిలిన వాటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు.
– బాలకృష్ణ
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…