కెసిఆర్ కి నేనంటే పుత్ర వాత్సల్యం… అయనకు నా మీద కోపం లేదు..!!

0
262

కరోనా లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన సినిమా షూటింగులని తిరిగి మొదలు పెట్టాలని చిరంజీవి నేతృత్వంలోని పలువురు సినీ ప్రముఖులు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసానితో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిసిన సంగతి తెలిసిందే.. అయితే ఆ మీటింగ్ కి తనని పిలువలేదని, ఇండస్ట్రీ పెద్దలు మంత్రి తలసానితో కలిసి భూములు పంచుకోవడానికి మాత్రమే కలిసారంటూ హీరో బాలకృష్ణ కామెంట్స్ చేయడం పెద్ద సంచలనాన్నే సృష్టించాయి. అయితే తాజాగా ఒక యుట్యుబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యులో ఈ విషయంపై స్పందించారు బాలకృష్ణ. ఈ విషయంలో సిఎం కెసిఆర్ పై వ్యాఖ్యలు చేసారు.

సీఎం కేసీఆర్‌ను కలవడానికి వాళ్ళు నన్ను ఎందుకు పిలవలేదో నాకు తెలియదు. గతంలో నేను రాజకీయ కోణంలో కేసీఆర్‌పై చేసిన విమర్శల వల్లే నన్ను పిల్వకుడదని వాళ్ళు అనుకుని ఉంటె.. ఆ విషయం నాకు చెప్పాల్సింది. నాకు తెలిసి సిఎం కేసీఆర్‌ గారికి నా మీద ఎప్పుడూ కోపం లేదు. అయినా రాజకీయాలు వేరు. అలా అనుకుంటే నామా నాగేశ్వరరావు ఆయనను ఎన్నో తిట్టు తిట్టారు. ఇప్పుడు ఆయన టీఆర్ఎస్‌ పార్టీలో చేరలేదా?. నందమూరి రామారావుగారి అభిమానిగా నేనంటే కేసీఆర్ ‌గారికి పుత్ర వాత్సల్యం ఉంది. అందువల్ల అయన అలా మాట్లాడి ఉండరు.. ఇక ఈ విషయంలో మిగిలిన వాటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు.

– బాలకృష్ణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here